రాధే శ్యామ్ లో హైలెట్స్ ఇవేనట…హిట్ గ్యారెంటీ…!?
Prabhas radhe shyam Movie :బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాలన్నీ అనుకోకుండా పాన్ ఇండియా లెవెల్లోనే వస్తున్నాయి. తాజాగా పూర్తికావస్తున్న రాధేశ్యాం మూవీ కూడా పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. జులై 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా లవ్ ట్రాక్ లో తీసిన సినిమా గా చెబుతున్నారు. ఈకాలం వాళ్ళు చూడలేని ఓ కొత్తలోకాన్ని ఈ చిత్రం చూపిస్తుందట .
డైరెక్టర్ రాధాకృష్ణ ఈ మూవీని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నట్లు టాక్. దీంతో ఈ సినిమా స్పెషాల్టీ గురించి ఫాన్స్ తో పాటు సినీ జనాలు కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మూవీలో ఆర్ట్ వర్క్ ప్రధానంగా ఆకర్షించనుందని చిత్ర యూనిట్ అంటోంది. విక్రమాదిత్యుడు పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడట.ఆనాటి వింటేజ్ కార్లను ఇందులో చూపిస్తున్నారట.
1960ల కాలం నాటి లవ్ స్టోరీ కనుక యూరప్ నగరంగా తలపించే సెట్టింగ్స్ వేశారు. కరోనా రాకపోతే ఇటలీ, యూరప్ దేశాల్లో చిత్రీకరించాల్సి ఉండేది. కానీ కరోనా కారణంగా రామోజీ ఫిలిం సిటీలోనే ఆర్ట్ డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో యూరప్ దేశాన్ని తలపించేలా, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా సెట్ వేసేసారు. అప్పటి కాలం, ఇప్పటి ట్రెండ్ సమన్వయంతో డ్రెస్సులు డిజైన్ చేశారట. ప్రభాస్ డ్రెస్ లకే దాదాపు 6కోట్లు వెచ్చించారని వార్తలు కూడా వచ్చాయి.
