అనిల్ రావిపూడి బంగ్లా ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు
Anil Ravipudi Buys Luxurious New Villa :దశ ఉండాలి గానీ ఒక దానివెంట ఒకటి కల్సి వచ్చేస్తుంటాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. కల్సి వస్తున్నప్పుడే కొందరు ముందు జాగ్రత్త తీసుకుంటారు. మరికొందరు నిర్లక్ష్యంగా ఉంటారు. అయితే ఇప్పటి తరంలో చాలామంది ముందుచూపుతోనే ఉంటున్నారు. ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరూ ఇలా స్టార్ హీరోలతో సైతం వరుస హిట్స్ అందుకుని ప్రస్తుతం ఎఫ్ 3చేస్తున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మంచి ఫ్లాట్ కొన్నట్లు వార్తలు వైరలవుతున్నాయి.
ఒక వైపు ఎఫ్ 3 చేస్తూనే మరోపక్క గాలిసంపత్ మూవీకి అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందించాడు. శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 11న విడుదల కానుంది. గాలి సంపత్ సినిమాకు అనిల్ సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ఎఫ్ 3 సినిమా భారీ బడ్జెట్ తో శరవేగంగా తెరకెక్కుతుండగా ఈ ఏడాది ఆగష్టు 27న ఈ సినిమా విడుదల కానుందని అంటున్నారు.
అయితే అనిల్ రావిపూడి కొన్న బిల్డింగ్ సాదాసీదాగా కాదని ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసాడని టాక్. ఎందుకంటే ఈ బంగ్లా కోసం అనిల్ ఏకంగా 12 కోట్లు వెచ్చించినట్లు ప్రచారం జరుగుతోంది. తన కుటుంబంతో కలిసి ఖరీదైన బంగ్లాలోకి ప్రవేశించనున్నాడని హైదరాబాద్ శివార్లలో ఈ బంగ్లా ఉందని అంటున్నారు. అయితే అనిల్ రావిపూడి దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. నిజానికి తొలిసినిమా పటాస్ నుంచి గత ఏడాది సంక్రాంతి కి బ్లాక్ బస్టర్ కొట్టిన సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు అనిల్ రావిపూడి విజయ యాత్ర సాగిస్తూనే ఉన్నాడు.
