MoviesTollywood news in telugu

ఏవండీ ఆవిడ వచ్చింది సినిమా గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Evandi Aavida Vachindi Full Movie :ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో శోభన్ బాబు ,శారద, వాణిశ్రీ కల్సి నటించిన ఏవండీ ఆవిడ వచ్చింది మూవీ అప్పట్లో ఓ సెన్షేషన్. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వాణిశ్రీ హిట్ మీద హిట్ అందుకుంటున్న సమయంలో వచ్చిన సినిమా ఇది. అప్పటి వరకూ ఇద్దరమ్మాయిల ప్రేమ మధ్య నలిగిపోయే పాత్రకు పెట్టింది పేరుగా నిల్చిన నటభూషణ శోభన్ బాబు ఇద్దరు భార్యల నడుమ నలిగిపోయే భర్తగా అద్భుతంగ నటించారు. నిజానికి శారద, వాణిశ్రీ హీరోయిన్స్ గా రాణిస్తున్న సమయంలో ఇద్దరి కాంబోలో సినిమా తీయాలని చూసినా పనవ్వలేదు. కానీ ఓ ఏజ్ కి వచ్చాక భార్యలుగా కల్సి నటించిన చిత్రమిది. సీతారత్నం గారబ్బాయి మూవీ తర్వాత ఏవండీ ఆవిడ వచ్చింది మూవీకోసం కథ రెడీ చేయమని కె ఎన్ ప్రసాద్ కి అప్పగించారు.

తల్లిదండ్రుల వత్తిడి మేరకు రెండు పెళ్లిళ్లు చేసుకుని, మూడు రోజులు ఒకరి దగ్గర, మరో మూడు రోజులు ఇంకొకరి దగ్గర గడిపే భర్త గా, ఒకరోజు పేరెంట్స్ దగ్గర గడిపే కొడుకు ఇలా మూడు రకాలుగా హీరో ఉండేలా రూపొందిన ఈ కథ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ, దర్శకుడు ఈవివికి బాగా నచ్చేసింది. ముందు వాణిశ్రీ దగ్గరకు వెళ్లి చెప్పడంతో ఒకే అయింది. రెండో పాత్రలో శారద నటిస్తారని కూడా చెప్పడంతో దానికి ఒకే అనడంతో శారద ను సంప్రదించారు. ఇక రిటైర్మెంట్ సమయంలో ఇలాంటి మంచి కథతో వచ్చినందుకు శోభన్ బాబు ఆనందపడుతూ వెంటనే డేట్స్ ఇచ్చేసారు.

మొత్తానికి సినిమా పట్టాలెక్కింది. యువజంటగా హరీష్, రంభ నటించారు. సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్, బ్రహ్మానందం, శివాజీ రాజా తదతర తారాగణం. కోటి మ్యూజిక్ అదిరిపోయింది. గంగను చూస్తే గౌరికి మంట … గౌరిని చూస్తే గంగతో తంటా సాంగ్ శోభన్ బాబు ఫాన్స్ కి తెగనచ్చేసింది. బ్రహ్మానందం, ఐరెన్ లెగ్ శాస్త్రి కామెడీ పండింది. 1993మార్చి 5న వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. సాంగ్స్ అన్నీ హిట్. శతదినోత్సవానికి విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు.