MoviesTollywood news in telugu

అనుష్క కెరీర్ ని దెబ్బతీసిన సినిమా ఏమిటో తెలుసా?

Telugu actress anushka :గ్లామర్ పాత్రలతోనే కాదు, అరుంధతి, భాగమతి, రుద్రమదేవి లాటి లేడీ ఓరియెంటెడ్ రోల్స్ తో ఆకట్టుకున్న టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టికి గల క్రేజ్ మాములుగా లేదు. స్టార్ హీరోల పక్కన సినిమాల్లో హీరోయిన్‌గా మొదటి ఛాన్స్ ఆమెకే ఇవ్వాలని దర్శకనిర్మాతలు ఎదురు చూస్తుంటారు. అదేక్రమంలో ఆమె చేసిన రిస్క్ ఆమె పాలిట వరంగా కాకుండా శాపంగా మారిందంటే నమ్మలేం. కానీ నిజం.

గతంలో బాహుబలి చిత్రం తరువాత సైజ్ జీరో చిత్రంలో నటించడానికి చాలా బొద్దుగా మారింది. అయితే ఆ తరువాత బాహుబలి 2 చిత్రం కోసం అనుష్క సన్నబడేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. అయినా తగ్గలేదు. దాంతో అనుష్క పాత్రను వీఎఫ్ఎక్స్ సాయంతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించాడు. ఇలా ఓ మూవీ కోసం అధిక బరువు పెరిగిపోయిన అనుష్క, ఇప్పుడు ఆ బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతోంది.

తాజాగా ఓ సినిమాను ఓకే చేసిన అనుష్క, ఈ సినిమాలో ఎలాగైనా సన్నబడాలని భావిస్తోంది. ఇందుకోసం ఆమె చాలా వర్కవుట్లు చేస్తుందని, డైట్‌ను ఖచ్చితంగా పాటిస్తోందట. ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా చేస్తున్నాడట. ఈ సినిమాలో అనుష్క పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని టాక్ .

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."