MoviesTollywood news in telugu

లావణ్య త్రిపాఠి తండ్రి ఎవరో తెలుసా…ఎన్ని కోట్ల అస్థి ఉందో తెలుసా?

Telugu Heroine Lavanya Tripathi :అందాల రాక్షసి మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, ఎన్నో సినిమాల్లో తన నటనతో క్రేజ్ తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి 1990డిసెంబర్ 15 న ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఈమె తండ్రి రాఘవేంద్ర త్రిపాఠి హైకోర్టు లాయర్. తల్లి జానకి త్రిపాఠి స్కూల్ టీచర్. లావణ్య త్రిపాఠిని ముద్దుగా లావణ్య , త్రిప అని పిలుస్తారట. ఉత్తరాఖండ్ మార్షల్ హైస్కూల్లో చదివింది. ముంబై నేషనల్ కాలేజీలో ఎకానమిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. లావణ్యకు శివాని అనే సిస్టర్, అక్షయ్ త్రిపాఠి అనే బ్రదర్ ఉన్నారు.

స్కూల్ స్టడీ అయ్యాక ఫ్యామిలీ మొత్తం ముంబైకి షిఫ్ట్ కావడంతో అక్కడ చదువుకుంది. స్టడీస్ సమయంలోనే మోడలింగ్ లోకి వెళ్లాలని భావించినా, స్టడీస్ పూర్తిచేసాకే వెళ్లాలని చెప్పడంతో అలాగే చేసింది. 2006లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ గెలిచింది. సినిమాల కోసం ట్రై చేస్తే, 2009లో టివి సీరియల్ లో ఛాన్స్ వచ్చింది. 2010వరకూ సీరియల్ లో నటించింది. సీరియల్స్ లో నటిస్తుండగా అను రాఘవపూడి డైరెక్షన్ లో అందాల రాక్షసి సినిమా ద్వారా 2012లో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆడకపోయినా లావణ్యకు మంచి పేరు వచ్చింది.

అలా పలువురు హీరోల సరసన లావణ్య నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 2012లో దూసుకెళ్తా, 2013లో భలే భలే మగాడివోయ్, 2016లో సోగ్గాడే చిన్నినాయన, 2017లోకి ఉన్నది ఒకటే జిందగీ, 2019లో అర్జున్ సురవరం మూవీస్ తో మంచి పేరు తెచ్చుకుంది. మార్చి 1న వచ్చిన ఎక్స్ ప్రెస్ 1లో సందీప్ కిషన్ తో కల్సి నటించింది.

చావుకబురు చల్లగా మూవీతో రిలీజ్ కి రెడీ అవుతోంది. మొదటి 13లక్షలు రెమ్యునరేషన్ తీసుకోగా ఆతర్వాతనుంచి 37లక్షలు అలా ఇంకా పెంచుకుంటూ వచ్చింది. కోకాపేటలో 80లక్షల విలువైన అపార్ట్మెంట్ లో ప్లాట్ ఉంది. రెండు ఖరీదైన కార్లున్నాయి. షూటింగ్స్ కోసం హైదరాబాద్ వస్తే, హోటల్స్ లో ఉండాల్సి వస్తుందని 2018లో ఈ ప్లాట్ కొనుగోలుచేసింది. ప్రభాస్, మాధురి దీక్షిత్, కాజల్ అగర్వాల్ అంటే ఇష్టమట.