MoviesTollywood news in telugu

ఈనాడు సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Eenadu Krishna Movie Wiki :వర్తమాన సామాజిక, రాజకీయ అంశాలపై సినిమాలు తీయడంలో ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ దిట్ట. హీరోయిజం చూపించే ఫైట్స్, హీరోయిన్ తో డ్యూయెట్స్ ఉండవు. అందుకు ఇప్పటి హీరోలు ఇలాంటి సినిమాలకు వెనకడుగు వేస్తున్నారు. పైగా ఆడతాయో లేదో డౌటు. కానీ సూపర్ స్టార్ కృష్ణ 200వ సినిమాగా వచ్చిన ఈనాడు అప్పట్లో ఓ సంచలనం. విప్లవ , అభ్యుదయ భావాల మేళవింపుతో రాజకీయ అంశాన్ని జోడించి తీసిన ఈ సినిమా లో కృష్ణ నటన హైలెట్. 100వ సినిమా కృష్ణ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిల్చిందో అలాగే 200వ మూవీ ఉండాలని కృష్ణ గట్టి ప్రయత్నంతో ఛత్రపతి శివాజీ మూవీ కోసం కసరత్తు చేసారు.

ఎన్ని వెర్షన్స్ రాసినా స్క్రిప్ట్ ఒకే కావడం లేదు. అయినా ఒక టీమ్ ని పెట్టి రాయిస్తూనే ఉన్నారు. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూ సొంతంగా పద్మాలయ బ్యానర్ మీద సినిమా తీయడానికి కూడా డేట్స్ ఇవ్వలేని పరిస్థితి. అప్పుడే ఓ చిన్న సినిమా చేయాలని కృష్ణ సోదరుడు మలయాళ మూవీ ఈనాడ్ నచ్చేసి, రీమేక్ హక్కులు కొనేశారు. హీరోగా శ్రీధర్ ని సెలెక్ట్ చేసి, డైరెక్టర్ గా పి.సాంబశివరావు ని ఒకే చేసారు. కానీ ఈ సినిమా మీకు సూటవుతుందని కృష్ణను కల్సి సాంబశివరావు చెప్పారు. అప్పటికే పూర్తి మాస్ హీరోగా ఉన్న కృష్ణకు కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఈ సినిమా ఎలా అనే సందేహం వచ్చింది. దాంతో పరుచూరి బ్రదర్స్ ని పిలిచి, ఈనాడ్ సినిమా చూడమని కృష్ణ పురమాయించారు.

సినిమా చూసిన పరుచూరి బ్రదర్స్ కూడా మీకు అయితేనే బాగుటుందని కృష్ణకు చెప్పేసారు. దాంతో కృష్ణ మరోసారి సినిమా చూసి, తన 200వ మూవీగా ఈనాడుని ప్రకటించారు. ఇక శివాజీ కథ పక్కన పడేసారు. పరుచూరి బ్రదర్స్ కథలో చాలా మార్పులు చేసి, మంచి స్క్రిప్ట్ రెడీ చేసారు. ఈ సినిమాలో హీరోయిన్ లేదు, డ్యూయెట్స్ ఉండవు. ఇలాంటి సినిమా ఎంచుకోవడం కృష్ణ గట్స్ కి నిదర్శనం. తనకు ఎంతో ఇష్టమైన అల్లూరి సీతారామరాజు పేరే ఇందులో రామరాజుగా పెట్టుకున్నారు. 1982జూన్ 9న చెన్నైలో షూటింగ్ స్టార్ట్. అక్కడే షూటింగ్ ఎక్కువ. గుంటూరు , తెనాలిలో కూడా షూటింగ్ చేసారు. క్లైమాక్స్ విజయవాడ అలంకార్ థియేటర్ దగ్గర 2డేస్ చేసారు. 30లక్షలతో 35రోజుల్లో షూటింగ్ పూర్తి.

1982డిసెంబర్ 17న ఈనాడు మూవీ రిలీజ్. అప్పటికే కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థపై తీసిన సీన్స్ బాగా పండాయి. క్లైమాక్స్ లో కృష్ణ చెప్పే డైలాగ్స్, మరణించడం సీన్స్ సూటిగా గుండెల్ని తాకుతుంది. సాంబశివరావు డైరెక్షన్ తీరు, రాఘవులు సంగీతం ఈనాడుకు ప్రాణం పోశాయి. టైటిల్ సాంగ్, రండి కదిలి రండి సాంగ్ అదిరిపోయాయి. ఇక అప్పుడే ఎన్టీఆర్ పార్టీ పెట్టడం, కృష్ణ సాంగ్ లో సైకిలు తొక్కడం, తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కావడం యాదృచ్ఛికం. తెలుగుదేశం విజయం సాధించాక కృష్ణ అభినందిస్తూ పేపర్ ప్రకటన ఇచ్చారు. అప్పటికి ఈనాడు 100రోజులు కూడా పూర్తయింది. టోటల్ 2కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కృష్ణ మాస్ ఫాలోయింగ్ వలన ఇలా కలెక్షన్స్ వచ్చాయి.