2020 లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన హీరోయిన్స్ వీరే

Tollywood 2020 Heroines :సినిమా ఇండస్ట్రీకి చాలామంది వస్తుంటారు. కానీ అందులో నిలబడేది చాలా తక్కువమంది. టాలెంట్ తో పాటు అదృష్టం ఉంటేనే సక్సెస్ అవుతారు. అలాగే 2020లో ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ వివరాల్లోకి వెళ్తే, కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు ఓటిటి లో రిలీజయ్యాయి. అందులో కొన్ని హిట్ అయ్యాయి. దాంతో కొత్త హీరోయిన్స్ కి మంచి గుర్తింపు దక్కిందని విశ్లేషిస్తున్నారు.

చూసి చూడంగానే మూవీతో ఎంట్రీ ఇచ్చిన బొల్లమ్మ ఆతర్వాత శర్వానంద్ హీరోగా జాను,మిడిల్ మెలోడీస్ మూవీస్ లో చేసింది. తెలుగులో మరో మూవీస్ లో ఛాన్స్ దక్కించుకుంది. సత్యదేవ్ హీరోగా వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తెలుగు అమ్మాయి రూపా కొడువారి మంచి పేరుతెచ్చుకుంది. ఇక సుమంత్ హీరోగా వచ్చిన మళ్ళీరావా మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ప్రీతి అస్రాని ప్రెజర్ కుక్కర్ మూవీతో హీరోయిన్ గా మారింది.

రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఉల్లాలా ఉల్లాలా మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అప్సర రాణి ప్రస్తుతం స్టార్ హీరోస్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తోంది. కృష్ణ అండ్ లీల, భానుమతి రామకృష్ణ మూవీస్ తో షాలిని వర్ణికట్టి హీరోయిన్ గా ఆడియన్స్ కి దగ్గరైంది. అదే ఏడాది పెళ్లి కూడా చేసుకుంది. దృశ్యంలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ఎస్తేర్ అనీల్ జోహార్ మూవీతో హీరోయిన్ గా మారింది. నందు హీరోగా ప్రియాంక శర్మ సవారీ మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి, ఇంకో రెండు సినిమాల్లో చేస్తోంది