వరుణ్ తేజ్ ఎన్ని కోట్ల అస్థిని సంపాదించాడో తెలుసా…పారితోషికం ఎంతో…?

Telugu Actor Varun Tej Movies :మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక్కో సినిమాతో తన కెరీర్ ని బిల్డప్ చేసుకుంటున్నాడు. 2004లో మెగా బ్రదర్ నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీకి ముకుంద మూవీతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ప్రస్తుతం విటి 10, ఎఫ్ 3 మూవీస్ లో చేస్తున్నాడు. అలాగే 1990జనవరి 19న నాగబాబు, పద్మజ దంపతులకు హైదరాబాద్ లో జన్మించాడు. వరుణ్ తేజ్ కి నిహారిక అనే సిస్టర్ ఉంది. గత డిసెంబర్ లో ఉదయ్ పూర్ లో చైతన్య జొన్నలగడ్డతో నిహారికాకి పెళ్లయింది.

ఈ ఏడాది 31ఏళ్ళు పూర్తిచేసుకున్న వరుణ్ తేజ్ ని వరుణ్ , విషు అని పిలుస్తారు. జూబ్లీ హిల్స్ భారతీయ విద్యాభవన్ లో , యూసుఫ్ గుడా సెయింట్ మేరీస్ కాలేజ్ లో స్టడీస్ పూర్తిచేసాడు. సినిమాల మీద మక్కువతో బికాం తో ఆపేసిన వరుణ్ ముకుంద మూవీతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ వరుణ్ కి పెద్దగా పేరు తేలేదు. 74న్నర లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. 2015లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో లోఫర్ మూవీలో చేసాడు. ఇదీ కూడా అనుకున్న హిట్ ఇవ్వలేదు. అయితే అదే ఏడాది క్రిష్ తీసిన కంచె మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు.

ఇక 2017లో వచ్చిన ఫిదా బ్లాక్ బస్టర్. ఈ మూవీకి 5కోట్ల 80లక్షల రెమ్యునరేషన్ అందుకున్నాడు. అలాగే 2018లో అంతరిక్షం, గద్దలకొండ గణేష్, 2019లో ఎఫ్ 2, మూవీస్ హిట్ కొట్టాయి. నాలుగు అధునాతన కార్లున్నాయి. మణికొండ లోని విల్లాలో నివసిస్తున్నాడు. దీని ఖరీదు 9కోట్ల వరకూ ఉంటుంది. గాయత్రీ హిల్స్ లో ఓ గెస్ట్ హౌస్ ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. జయప్రద, శ్రీదేవి అభిమాన తారలు. హైద్రాబాద్ దం బిర్యానీ అంటే ఇష్టం. ఆరడుగుల మూడు అంగుళాల ఎత్తు, 86కిలోల బరువు గల వరుణ్ తేజ్ కి ఇంకా పెళ్లి కాలేదు.