MoviesTollywood news in telugu

యష్ ఇంటి ఖరీదు మాములు రేంజ్ లో లేదు…ఎన్ని కోట్లో…?

Yash new house :దేనికైనా అదృష్టం ఉండాలని అంటారు. టాలెంట్ ఎంతున్నా లక్కు లేకుంటే నో చేంజ్. అదే సినిమా రంగంలో లక్కుంటే ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చేస్తుంది. అందుకు కన్నడ స్టార్ హీరో యష్ నిదర్శనం. ఎందుకంటే, ఒక సాధారణ ఆర్టీసీ బస్ డ్రైవర్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి, కెజిఎఫ్ మూవీతో హీరోగానే కాదు,ఆర్థికంగా కూడా బాగా ఎదిగిపోయాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్. అతడి సొంతూళ్లో 80 ఎకరాలు కూడా అప్పుడే కొనేసాడట.

ఇక కెజిఎఫ్ సీక్వెల్ లో కూడా చేస్తున్న యష్ కి యమ క్రేజ్ పెరిగిపోయింది. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు,దీంతో ఇప్పుడు హీరో యష్ మంచి డిమాండ్ ఉన్న హీరోలలో ఒకరిగా ఎదిగిపోయాడు. ఇప్పుడు యష్ డేట్ల కోసం బడా నిర్మాతలు క్యూలో నిలుచుంటున్నారంటే ఏరేంజ్ లో ఉన్నదో వేరే చెప్పక్కర్లేదు.

యష్ ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు ఖరీదు గురించి తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం బెంగుళూరులోని అత్యంత విలాసవంతమైన ఇంటిని యష్ కొనుగోలు చేసాడట. ఆ ఇంటి విలువ సుమారు 4 కోట్లకు పైగా ఉంటుందని టాక్. అంతేకాదు ఫ్యామిలీతో కలిసి ఇప్పటికే ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యాడని అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."