MoviesTollywood news in telugu

కలియుగ విశ్వామిత్ర వెనుక రహస్యం…తెలిస్తే నమ్మలేరు

Kaliyuga Viswamitra 1990 :కృష్ణ బావమరిది యు సూర్యనారాయణబాబు అప్పట్లో ఎన్టీఆర్ ని విమర్శిస్తూ కలియుగ విశ్వామిత్ర తీశారు. విజయచందర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ వేయగా, మేనక వేషం వేసిన రమ్యకృష్ణకు ఆరోజుల్లో రెమ్యునరేషన్ 25వేలు ఇచ్చారు. చంద్రబాబు క్యారెక్టర్ ని ప్రదీప్ శక్తి వేసాడు. సినిమాకు మొదటి వారంలో ఏపీలో అన్ని థియేటర్లు ఫుల్ అయ్యాయి.

మొదటి వారం మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న పి ఉపేంద్ర కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ ఉండేవారు. ఎన్టీఆర్ ని విమర్శిస్తూ సినిమా ఎలా తీస్తారని నోటీసు పంపించారు. ఒక సెలబ్రిటీ అయినా సరే, రాజకీయాల్లో ఉంటె సినిమా తీయకూడదా అని లాయర్ నోటీసు పంపిస్తే సమాధానం లేదని సూర్యనారాయణబాబు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్యూలో చెప్పారు.

నిజానికి 1972లోనే ఎన్టీఆర్ తో కృష్ణ గారు దేవుడు చేసిన మనుషులు సినిమా తీశారు. అప్పుడు మా ఊళ్ళో కూడా షూటింగ్ చేస్తే, ఎన్టీఆర్ తో సహా వందమంది ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్ కి డిన్నర్ ఇచ్చానని,అప్పట్లో రెండు గంటలు ఉండి డిన్నర్ చేసి, వెళ్లారని సూర్యనారాయణ బాబు చెప్పారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."