MoviesTollywood news in telugu

70 ఏళ్ళు పైబడిన ఈ స్టార్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో …?

70 + Aged Tollywood Stars :దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు వయస్సు 79సంవత్సరాలు. కానీ వయస్సు కనిపించకుండా ఎనర్జిటిక్ గా కన్పిస్తారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ వయస్సు 78సంవత్సరాలు. ఆరోగ్యంగా ఉంటూ అడపాదడపా సినిమా ఫంక్షన్స్ కి వస్తున్నారు. నటుడు చలపతిరావు 77సంవత్సరాల వయస్సులో కూడా నటిస్తున్నారు. మరో సీనియర్ నటి రాజశ్రీ వయస్సు 77సంవత్సరాలు. సినిమాలు దూరంగా ఉంటున్నారు. మరో హాస్య నటుడు చిడతల అప్పారావు 77ఏళ్ల వయస్సులో ఇంటి దగ్గరే ఆరోగ్యంగా ఉన్నారు.

బ్లాక్ అండ్ వైట్ సినిమాల మొదలు కలర్ చిత్రాల వరకూ ఎన్నో సినిమాల్లో నటించిన శారద వయస్సు 76సంవత్సరాలు. ఎక్కువ దైవ చింతనతో గడుపుతూ ఛాన్స్ వస్తే తెరపై కూడా కనిపిస్తున్నారు. ఎన్నో సినిమాల్లో హీరోగా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న చంద్రమోహన్ వయస్సు 76సంవత్సరాలు. రచయితలు పరుచూరి బ్రదర్స్ లో వెంకటేశ్వరరావు (75), గోపాలకృష్ణ (72) రచయితలుగా నటులుగా రాణిస్తున్నారు. జెన్నీ, సుబ్బరాయ శర్మ 75ఏళ్ల వయస్సులో యాక్టివ్ గా ఉన్నారు.

ఒకప్పుడు హాస్య నటిగా అదరగొట్టేసి,దాదాపు 1400కి పైగా సినిమాల్లో నటించిన రమాప్రభ వయస్సు 74సంవత్సరాలు. పరిపూర్ణ ఆరోగ్యంతో ఇప్పటికీ సినిమాలు చేస్తూ అలరిస్తోంది. సీనియర్ యాక్టర్ వాణిశ్రీ వయస్సు 73సంవత్సరాలు. ఎన్టీఆర్, అక్కినేని హయాంలో ఓ వెలుగు వెలిగిన ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదరగొట్టేసాడు.

మంచి పాత్ర వస్తే చేయడానికి రెడీ అంటున్నారు. రాజబాబు మరో తమ్ముడు అనంత్ వయస్సు 73సంవత్సరాలు. సీనియర్ నటి అన్నపూర్ణ 73ఏళ్ళ వయస్సులో కూడా నటిస్తూ ఎఫ్ 2లో సైతం అదరగొట్టారు. ఇంకా సినిమాల్లో చేస్తున్నారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వయస్సు 73సంవత్సరాలు. మరో సీనియర్ యాక్టర్ శరత్ బాబు వయస్సు 70సంలు. పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఈయన నటించడానికి సిద్ధంగానే ఉన్నారు.