MoviesTollywood news in telugu

ఇండస్ట్రీలో మరో విషాదం..ప్రముఖ నటి భర్తను మింగేసిన కరోనా

Malashri Husband :కరోనా చిన్న పెద్ద పేద ధనిక తేడా లేకుండా అందరినీ చుట్టేస్తుంది ఈ మాయదారి కరోనా కారణంగా సినీ నిర్మాత నటి మాలాశ్రీ భర్త రాము మరణించారు గత మూడు రోజులుగా కరొనాతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.

కన్నడ పరిశ్రమలో కోటిరాముగా పేరుతెచ్చున్న రాము ఏకే 47, లాకప్‌డెత్‌, కలాసిపాళ్య లాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలను నిర్మించి సక్సెఫుల్ నిర్మాతగా కన్నడలో మంచి పేరుతెచ్చున్నారు. గత వారం అనారోగ్యంగా ఉండటంతో టెస్ట్ చేయించుకుంటే కోవిడ్ నిర్ధారణ అయింది.

కాగా శుక్రవారం నాటి నుంచి ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేరారు. కాగా సోమవారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

తెలుగు, కన్నడ, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న మాలాశ్రీని పెళ్లి చేసుకున్నారు రాము. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రాము మరణ వార్తతో కన్నడ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."