MoviesTollywood news in telugu

‘థ్యాంక్ యు బ్రదర్’ రివ్యూ…హిట్టా….ఫట్టా…?

Thank You Brother Movie Review In Telugu :రమేష్ రాపర్తి దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్ కీలకమైన పాత్రను పోషించిన  థాంక్యూ బ్రదర్ సినిమా ఈరోజు ఆహా OTT ద్వారా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నిడివి 96 నిమిషాలు. చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్ గా సూటిగా చెప్పేశారు. కథలో మొదటిభాగం విషయానికొస్తే అంతగా ఆసక్తికరంగా లేదు తర్వాత వచ్చే సన్నివేశం ఏమిటో అర్థం అయ్యేలా ఉంది.

భర్త చనిపోయి ఎలాంటి ఆర్థిక అండలేకుండా జీవితాన్ని గడిపే ప్రియ (అనసూయ), చిన్నతనంలోనే తండ్రి చనిపోయి ఆ ప్రేమకు దూరమైన అభి (విరాజ్ అశ్విన్)‌ల కథే థ్యాంక్ యు బ్రదర్. ప్రియ భర్త సూర్య (ఆదర్శ్) ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మరణిస్తారు. ఆయన మరణంతో ప్రియ జీవితం తలకిందులవుతుంది.

అభి.. కష్టాల్లో ఉన్న ప్రియకు ఎలా సాయం చేశాడు?.. అసలు ఈ ఇద్దరూ కలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లిఫ్ట్‌లో ఇరుక్కున ప్రియ, అభిలు ఎలా బయటపడ్డారు? అభి చేసిన గొప్ప సాహసం ఏంటి? అనేవి కథలోని కీలక అంశాలు

సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే అనసూయ నటన,Cinematography…ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ సన్నివేశాలు,కామెడీ,ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు. ఇక అనసూయ తనను తాను నిరూపించుకునందుకు మరో పాత్ర లభించింది. కానీ పూర్తి సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు.