MoviesTollywood news in telugu

టాలీవుడ్ ఇండస్ట్రీలో బావ బామ్మర్థులు ఎంత మంది ఉన్నారో…!?

Brother in laws in tollywood industry :టాలీవుడ్ లో బావ బామ్మర్దులు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి అయన బావమరిది మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఇటువంటి బావ బామ్మర్దులు మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. వారి మీద ఒక లుక్ వేద్దాం.

చిరంజీవి – అల్లు అరవింద్
చిరంజీవి అల్లు అరవింద్ చెల్లెలిని వివాహం చేసుకున్నాడు.

మహేష్ బాబు – సుధీర్ బాబు
మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని ని సుధీర్ బాబు వివాహం చేసుకున్నాడు.

వెంకటేష్ – నాగార్జున
వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని నాగార్జున వివాహం చేసుకున్నాడు.

అజిత్ – రిషి
రిషి అక్క శాలినిని అజిత్ వివాహం చేసుకున్నాడు.

రామ్ -శర్వానంద్
రామ్ అక్కను శర్వానంద్ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు.

బాల సుభ్రమణ్యం – శుభలేఖ సుధాకర్
బాల సుభ్రమణ్యం చెల్లెలు శైలజను సుధాకర్ వివాహం చేసుకున్నాడు.

రామ్ చరణ్, అల్లు అర్జున్ వరుసకు బావ బామ్మర్థులు అవుతారు.

రామ్ చరణ్ -కల్యాణ్ దేవ్
కల్యాణ్ దేవ్ రామ్ చరణ్ చెల్లి శ్రీజను వివాహం చేసుకున్నాడు.

మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, శిరీష్‌, రామ్ చరణ్, వరుణ్ తేజ్‌ల మధ్య బావ బామ్మర్ధుల సంబంధం ఉంది.

జూనియర్ ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్‌లకు నారా రోహిత్ వరుసకు బావ అవుతాడు.

నందమూరి నట సింహం బాలకృష్ణకు దగ్గుబాటి వెంకటేశ్వరావు, చంద్రబాబు నాయుడుకు బామ్మర్ధి అవుతాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్మాతగా కొన్ని సినిమాలను నిర్మించారు.

నాగ చైతన్య, అఖిల్ సోదరులకు సుశాంత్,సుమంత్ ఇద్దరూ.. వరుసకు మేనబావ అవుతాడు.

నాగ చైతన్య – రానా దగ్గుబాటి కూడా వరుసకు బావ బామ్మర్థులు అవుతారు.

రామ్ పోతినేని అక్కను శర్వానంద్ అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. కాబట్టి వీళ్లిద్దరు వరుసకు బావ బామ్మర్థులు అవుతారు.