Healthhealth tips in telugu

కరోనా వచ్చిన వారిలో ఆ విటమిన్ లోపం వస్తుందట…జాగ్రత్త తప్పనిసరి

corona virus effect Vitamin D :కరోనా వైరస్ వచ్చి దాదాపుగా సంవత్సరం దాటిపోయింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వ్యాక్సిన్ కొరత ఉంది. వ్యాక్సిన్ వేయించుకున్న సరే జాగ్రత్తలు తప్పనిసరి. చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవటానికి ముందుకు రాలేదు. ఇక ఇప్పుడు కరోనా తీవ్రతరం కావటంతో వ్యాక్సిన్ వేయించుకోవటానికి ముందుకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఉంది.

అయితే ఒకసారి కరోనా వచ్చి బయటపడిన వారిలో కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి.ముఖ్యంగా విటమిన్ డి లోపం కలుగుతుంది. ఈ విటమిన్ లోపిస్తే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కాబట్టి కరోనా వచ్చి తగ్గినవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా విటమిన్-డి స్థాయి లు మహిళల్లో కన్నా పురుషుల్లో తక్కువగా ఉన్నాయని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. రక్తంలో విటమిన్-డి ఉంటేనే శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి ఈ విటమిన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ డి కోసం ఉదయం ఎండలో పది నిమిషాలు ఉండాలి. అలాగే విటమిన్ డి లభించే ఆహారాలను తీసుకోవాలి.