MoviesTollywood news in telugu

ఊహలు గుసగుసలాడే సీరియల్ హీరో ఎన్ని సినిమాలు చేశాడో…?

oohalu gusagusalade serial in Telugu : వెండి తెరకు ధీటుగా బుల్లితెర కు ప్రేక్షకాదరణ ఉండడంతో కొత్త కొత్త సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. ఇక జి తెలుగులో వస్తున్న కొత్త సీరియల్స్ లో భాగంగా ఊహలు గుసగుసలాడే సీరియల్ ఇటీవల స్టార్ట్ అయింది. ఈ సీరియల్ ఆడియన్స్ ఆదరణ బాగానే అందుకుంటోంది. ఇందులో హీరోగా అభిరాం రోల్ లో నటిస్తున్న అకుల్ బాలాజీ 1979ఫిబ్రవరి 23న ఏపీలోని కోడూరు లో భాస్కరరావు,సరళాదేవిలకు జన్మించాడు. స్కూల్ ఎడ్యుకేషన్ అక్కడే పూర్తిచేసాడు.

గ్రాడ్యుషన్ పూర్తిచేసిన అకుల్ 16ఏళ్ళ వయస్సులోనే బెంగుళూరుకి షిఫ్ట్ అయ్యాడు. అక్కడ భరతనాట్యం,కథక్ నృత్యాలు నేర్చుకున్నాడు. యాంకర్ గా కూడా చేసిన అకుల్ చాలా షోస్ కి హోస్ట్ గా చేసాడు. జి తెలుగులో 2012లో పెళ్ళినాటి ప్రమాణాలు సీరియల్ తో సీరియల్ నటుడిగా తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో సినిమాల్లో చేసాడు. అటు కన్నడ,ఇటు తెలుగులో షోస్ కి హోస్ట్ గా చేస్తూ తన కెరీర్ మలుచుకున్నాడు.

కామెడీ కిలాడి వంటి షోస్ తో పాటు రియాల్టి షోస్ కి కూడా హోస్ట్ గా చేసాడు. ఇటీవల కన్నడలో తకధిమిత డాన్స్ షోకి హోస్ట్ గా చేసాడు. ఇక జి తెలుగులో సై అంటే సై షోకి హోస్ట్ గా చేసాడు. అలాగే మాటీవీలో దేశముదుర్లు షోకి హోస్ట్ గా చేసాడు. మోస్ట్ పాపులర్ యాంకర్ అవార్డు కూడా అందుకున్నాడు. కన్నడ ఈటీవీలో గుప్తగామిని, ఆగద వంటి సీరియల్స్ లో చేసాడు. కన్నడ బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొని విన్నర్ గా నిలిచాడు. నేరము శిక్ష అనే మూవీతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. బాలాజి నటించిన మూడు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.