MoviesTollywood news in telugu

ప్రేమదేశం హీరో గుర్తు ఉన్నాడా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

Tollywood hero Vineeth :ప్రేమదేశం సినిమాతో ఎక్కడలేని ఇమేజ్ తెచ్చుకున్న హీరో వినీత్ తో పాటు అబ్బాస్ కూడా పాపులర్ అయ్యారు. తెలుగులో కూడా వినీత్ పాపులర్ అయ్యాడు. అయితే ఎక్కువకాలం నిలదొక్కుకోలేక పోవడానికి కారణంలోకి వెళ్తే, నిజానికి ఇతడికి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది. అయితే స్వతహాగా మలయాళీ కావడంతో తెలుగు భాషపై పట్టులేదు. సుమన్,భానుచందర్, రాజశేఖర్ మాదిరిగా డబ్బింగ్ చెప్పించుకోడానికి వీలున్నా, క్లాస్ పాత్రలు తప్ప మాస్ రోల్స్ కి సరిపోలేదు. పైగా నటి శోభన బ్రదర్ అయినప్పటికీ ఆమె నుంచి రికమండేషన్ అసలు ఆశించలేదు. అతడి మేనత్త సుకుమారి ఉన్నా సరే, ఆమె పేరు చెప్పి లాభపడాలని అనుకోలేదు.

ఇక వినీత్ క్లాసికల్ డాన్సర్ కావడంతో లవర్ బాయ్ కథలు,డాన్సర్ కథలు ఎక్కువగా వచ్చేవి. తెలుగులో సరిగమలు మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. సినిమా బాగున్నా సక్సెస్ కాలేదు. దీంతో తెలుగులో నమ్మకం పెట్టుకోలేదు. అయితే ప్రేమదేశం మూవీతో స్టార్ హీరోగా మారిపోయాడు. టబు హీరోయిన్ గా అబ్బాస్, వినీత్ హీరోలుగా వచ్చిన ఈ మూవీ యూత్ ని ఆకట్టుకుంది. దీంతో వినీత్ ఆశలు చిగురించాయి. స్వశక్తితో ఎదగాలన్న ప్రయత్నం ఫలించింది. వరుస ఆఫర్లు రావడంతో పది సినిమాలు చేసాడు.

ప్రేమపల్లకి,ఆరోప్రాణం,రుక్మిణి,వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్, పాడుతా తీయగా, ఇలా వరుస సినిమాలు చేసేసిన వినీత్ కి ఇందులో ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ ప్లాప్. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి లాహిరి లాహిరి లో, బాపు బొమ్మకు పెళ్ళంట వంటి మూవీస్ లో నటించాడు. అయినా పెద్దగా కల్సి రాలేదు. అదే సమయంలో మలయాళంలో సక్సెస్ లు అందుకోవడంతో అక్కడ ఆఫర్స్ పెరిగి, తెలుగులో తగ్గిపోయాయి. 2006లో థాంక్స్ సినిమా తర్వాత 15ఏళ్లకు నితిన్ మూవీ రంగ్ దే లో వినీత్ కనిపించాడు. చంద్రముఖి మూవీలో డాన్సర్ గా ఇతడి నటన ఆకట్టుకుంది.