MoviesTollywood news in telugu

కో సింగర్స్ నే పెళ్లి చేసుకున్న టాప్ సింగర్స్ వీరే

Tollywood Singers :సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు,సింగర్స్ ,మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా చాలామంది తమకు నచ్చినవాళ్లను పెళ్లిచేసుకున్నారు. అందులో కొందరు సింగర్స్ తమ తోటి సింగర్స్ ని, మ్యూజిక్ డైరెక్టర్స్ ని పెళ్లిచేసుకున్నారు. సింగర్ మల్లికార్జున్ తెలుగులో ఎన్నో సినిమాల్లో సాంగ్స్ పాడడమే కాదు, సహ సింగర్ గోపికా పూర్ణిమా ప్రేమలో పడ్డాడు. 2008లో వీరిద్దరూ పెళ్లిచేసుకున్నారు.

టాలీవుడ్ లో సింగర్ గా,డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణిస్తున్న హేమచంద్ర తన సహ సింగర్ శ్రావణ భార్గవిని ప్రేమించి, పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్ టిప్పూ కూడా తన కో సింగర్ హరిణిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. ఈమె తెలుగులో 100కి పైగా సాంగ్స్ పాడింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా సింగర్ శ్రీ వర్దిని ని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. ఈమె తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది.

మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ మేనల్లుడు జివి ప్రకాష్ తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా,డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట మూవీస్ కి మ్యూజిక్ అందించాడు. కో సింగర్ సైన్ధవి తో ప్రేమలో పడడంతో 2013లో పెళ్లి చేసుకున్నారు. ఈమె తెలుగులో గంగోత్రి,ఇష్క్,ఖలేజా మూవీస్ లో పాటలు పాడింది.