MoviesTollywood news in telugu

వదినమ్మ సీరియల్ భరత్ రియల్ లైఫ్…ఎన్ని సినిమాల్లో నటించాడో…?

Vadinamma serial Bharath :బుల్లితెర ఆడియన్స్ ని విశేషంగా అలరిస్తున్న సీరియల్స్ లో వదినమ్మ సీరియల్ ఒకటి. ఈ సీరియల్ లో కొద్దిగా మొండితనం గల పాత్రలో భరత్ నటిస్తున్నాడు. ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడి పేరు చరణ్ రాజ్. ముద్దుపేరు రాజ్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇతడి స్వస్థలం ఏపీలోని గుంటూరు.

సినిమాల్లో నటించి, ఆ తర్వాత సీరియల్ లోకి వచ్చిన రాజ్ నిజానికి ఎస్సై అవ్వాలని అనుకున్నాడు. ఎందుకంటే అది వాళ్ళ అమ్మ కోరిక. అందుకే బాగా చదువుపై దృష్టి పెట్టాడు. డిగ్రీ పూర్తిచేసినప్పటికీ ఎస్ ఐ ఫైనల్ ఎగ్జామ్ లో నిర్లక్ష్యం కారణంగా పోస్టు కి సెలక్ట్ కాలేదు. దాంతో ఎంబీఏ చేయడానికి హైదరాబాద్ వచ్చిన రాజ్ సినిమాల్లో నటించాలని ఆఫీసుల చుట్టూ తిరిగాడు.

దాంతో ఓం శాంతి మూవీలో ఛాన్స్ లభించడంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రాజ్ కి మంచి పేరు వచ్చింది. ఈలోగా సీరియల్స్ లో ట్రై చేయమని ఒక డైరెక్టర్ సలహా ఇవ్వడంతో 2010లో కార్తీ సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. జెమినిలో అగ్నిపూలు, జీటీవీలో గోరంత దీపం సీరియల్స్ లో నటించాడు. రాములమ్మ సీరియల్ లో కూడా నటించాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."