MoviesTollywood news in telugu

కరోనా దెబ్బకు తల్లడిల్లుతున్న నటులు వీరే…!?

Kollywood Heroes:మహమ్మారి కరోనా అన్ని రంగాలను దెబ్బతీసి ఎందరో ప్రాణాలు హరించింది. ఎందరికో కరోనా సోకింది. అయితే దెబ్బతిన్న రంగాల్లో సినిమా రంగం ఒకటి. ఈ రంగం ఎప్పటికి కోలుకుంటుందో తెలియడం లేదు. తెరిచిన థియేటర్లు పట్టుమని మూడు నెలలు గడవకముందే సెకండ్ వేవ్ తో మూతపడ్డాయి. షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. చాలామంది సెలబ్రిటీలకు కరోనా సోకింది.

అయితే సినిమాలు రిలీజ్ కాకపోవడం, సైన్ చేసిన సినిమాలు పూర్తికాకపోవడంతో చాలామంది నటులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక నిర్మాతలు సరేసరి. బిచ్చగాడు మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్ ఆంథోని నటించిన మూడు సినిమాలు,తమిళంలో హీరోగా,తెలుగులో విలన్ గా రాణిస్తున్న విజయ్ సేతుపతి మూడు సినిమాలు, అలాగే జివి ప్రకాష్, అరుణ్ విజయ్ ఒప్పుకున్న మూడేసి సినిమాలు షూటింగ్ జరక్క నిలిచిపోయాయి.

ఇప్పటికే వీళ్ళు కొన్ని సినిమాల్లో నటించగా అవి రిలీజ్ కాలేదు. ఇందులో విజయ్ సేతుపతి నటించిన ఐదు సినిమాలు, జివి ప్రకాష్ నటించిన ఐదు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే పలువురు అగ్ర హీరోల మూవీస్ సైతం నిలిచిపోయాయి.ఎప్పుడు రిలీజ్ అవుతాయో,ఎపుడు షూటింగ్ జరుగుతాయో తెలీకుండా ఉందని పలువురు వాపోతున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."