MoviesTollywood news in telugu

కృష్ణ తులసి అఖిల్ కి ప్రేమ ఎంత మధురం అనుకి రిలేషన్ ఏమిటో…?

Prema Entha Madhuram Serial Heroine Anu :స్టార్ట్ అయిన నాటినుంచి కృష్ణ తులసి సీరియల్ మంచి రేటింగ్ తో విశేష ప్రేక్షకాదరణతో నడుస్తోంది. ఇందులో నటీనటులు తమ నటనతో ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ముఖ్యంగా ఇందులో హీరోగా చేస్తున్న అఖిల్ నటన ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. అఖిల్ అసలు పేరు దిలీప్ ఆర్ శక్తి. యితడు కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో అక్టోబర్ 16న జన్మించాడు.

మాస్టర్ ఆఫ్ కామర్స్ పూర్తిచేసి, హెల్త్ కేర్ అనే కంపెనీలో ఎక్కౌంటెంట్ గా చేసాడు. అయితే చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి ఉంది. అందుకే మొదట మోడలింగ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015లో మిస్టర్ దుబాయ్ పోటీల్లో పాల్గొని ఫైనల్ రౌండ్ లో ఫస్ట్ రన్నరప్ గా నిలిచాడు. ఇక విద్యా వినాయక సీరియల్ తో కన్నడ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు.

దిలీప్ ఆతర్వాత ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ అనుతో కల్సి కస్తూరి నివాస అనే సీరియల్ లో నటించాడు. ఈ రెండు కన్నడ సీరియల్స్ హిట్ కావడంతో స్వర్ణ ఖడ్గం సీరియల్ తో తెలుగు బుల్లితెరపై మెరిశాడు. కస్తూరి నివాస కన్నడ సీరియల్ తో పాటు కృష్ణ తులసి సీరియల్ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యితడు సినిమాల్లో కూడా నటించాడు. కన్నడలో నటించిన రోబో మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. డాన్స్ షోస్ లో కూడా పాల్గొన్నాడు.