సీరియల్స్ కంటే ముందు వంటలక్క ఏమి చేసేదో తెలుసా…?

karthika deepam premi viswanath :కార్తీకదీపం సీరియల్ రాగానే ప్రతి ఒక్కరూ పనులు అన్ని మానేసి మరీ సీరియల్ ముందు కూర్చుంటారు. కార్తీకదీపం సీరియల్ చూసే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. దాదాపుగా మూడున్నర సంవత్సరాలుగా వస్తున్న ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది.

ఈ సీరియల్ లో వంటలక్క పాత్రలో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ సీరియల్స్ లో నటించడానికి ముందు ఏమి చేసేదో తెలుసా. లా చదివిన ప్రేమి విశ్వనాథ్ ఒక ప్రైవేట్ సంస్థకు లీగల్ అడ్వైజర్ గా పనిచేసింది అలాగే మోడల్ గా కూడా చేసింది సోలోమన్ 3డి అనే ఒక సినిమాలో నటించింది.

అంతేకాకుండా ప్రేమి విశ్వనాథ్ అన్నయ్య ఫోటోగ్రాఫర్ కావటంతో తను కూడా ఫోటోగ్రఫీ మీద ఇష్టంతో కొన్ని పెళ్ళిళ్ళకు శుభకార్యాలకే పని చేసిందట. ప్రేమి విశ్వనాథ్ అన్నయ్య శివ ప్రసాద్ కి ఎర్నాకులం లో రెండు స్టూడియో లు ఉన్నాయి. కార్తీక దీపంతో బాగా ఫేమస్ అయిన ప్రేమి విశ్వనాథ్ కి ఎన్ని అవకాశాలు వచ్చినా ఓకే చేయడం లేదట.