మహేష్ బాబు రీమేక్ సినిమాలకు దూరం…కారణం ఇదే…?

Mahesh Babu Movies :మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని యంగ్ హీరోల వరకూ చాలామంది రిమేక్ మూవీస్ చేస్తూ హిట్స్ కొడుతున్నారు. రిమేక్ హక్కుల విషయంలో హీరోల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే గడిచిన రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ తో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు రీమేక్ మూవీస్ అంటే దూరంగానే ఉంటున్నాడు.

పైగా మహేష్ నటించిన మూవీస్ ఇతర భాషల్లోకి డబ్ అవ్వడం, రీమేక్ అవుతున్నాయి తప్ప యితడు మాత్రం వాటి జోలికి వెళ్లడం లేదు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సర్కారువారి పాట సినిమా పాన్ ఇండియా లెవెల్లో నిర్మాణం కావాలని ఫాన్స్ ఆశపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి కనుక.

మరి సర్కారు వారి పాట విషయంలో మహేష్ ఆలోచన ఎలా ఉందొ అప్పుడే చెప్పలేం. ఇక మహేష్ నటించి బ్లాక్ బస్టర్ అందుకున్న ఒక్కడు, పోకిరి,బిజినెస్ మ్యాన్,అతిధి వంటి మూవీస్ తో పాటు ప్లాప్ టాక్ తెచ్చుకున్న నిజం మూవీ కూడా ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయి. అంతేకాదు గతంలో మహేష్ నటించిన నాని మూవీ కూడా రీమేక్ కాదు.