MoviesTollywood news in telugu

బాలయ్య బాలీవుడ్ ఎంట్రీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Tollywood Hero BalaKrishna :మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, విక్టరీ వెంకటేష్ లు తమ చిత్రాలతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ నందమూరి నటసింహం బాలకృష్ణ మాత్రం ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. అన్నీ అనుకున్నట్టు జరిగివుంటే బాలయ్య కూడా బాలీవుడ్ లో సత్తా చాటేవాడని అంటుంటారు. తండ్రి ఎన్టీఆర్ మాదిరిగా బాలయ్య కూడా జానపద, పౌరాణిక చిత్రాల్లో నటించి వైద్యమైన పాత్రలతో మెప్పించాడు. ఇక సాంఘిక చిత్రాల్లో చెప్పక్కర్లేదు. బాలయ్య నటించిన రౌడీ ఇనస్పెక్టర్ మూవీ తెలుగులో సూపర్ హిట్.

అదే సినిమాను హిందీలోకి డబ్బింగ్ చేసి ముంబై లో 17 థియేటర్లలో విడుదల చేసారు. డబ్బింగ్ మూవీస్ లో ఇదో రికార్డు. దీంతో 1991లో తెలుగు,హిందీ భాషల్లో ఓ భారీ మూవీ తీయడానికి ప్రయత్నాలు జరిగాయి. తెలుగులో బ్లాక్ బస్టర్ ప్రతిఘటన మూవీ హిందీలో ప్రతిఘాత్ గా రీమేక్ చేయగా దానికి డైరెక్షన్ చేసిన ఎన్ చంద్రన్ ని బాలయ్య మూవీకి డైరెక్టర్ గా సెలెక్ట్ చేశారు. కమల్ హాసన్ వంటి వారితో ఎన్నో హిట్ మూవీస్ తీసిన ఏ ఎం రత్నం నిర్మాతగా ముందుకొచ్చారు. పైగా ఆరుకోట్ల బడ్జెట్ అనగానే అప్పట్లో టాలీవుడ్ షేక్ అయింది.

ఇక నిప్పురవ్వ మూడు కోట్లు కలెక్ట్ చేయడంతో రెండు భాషల్లో తీసే బాలయ్య సినిమాకు కలెక్షన్ ఈజీ అవుతుందని ట్రేడ్ పండితులు విశ్లేషించారు. మా కాంబినేషన్ లో పవర్ ఫుల్ సినిమా వస్తుందని చంద్రన్ కూడా చెప్పారు. బాలయ్య సరసన నటించేందుకు పాపులర్ హీరోయిన్ అవసరం కనుక మాధురీ దీక్షిత్ కోసం ఏ ఎం రత్నం ట్రై చేసారు.

చంద్రన్ తీసిన తేజా మూవీలో ఏక్ దో తీన్ సాంగ్ తో ఓ ఊపు ఊపేసిన మాధురి దీక్షిత్ కి మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ లో నెంబర్ వన్ గా ఉండడం వలన ఎంతమంది ప్రయత్నించినా టాలీవుడ్ కి ఆమె రాలేదు. అయితే రెండు భాషల్లో కనుక మాధురి ఈమూవీకి ఒకే చెప్పింది. అయితే చంద్రన్ వేరే ప్రాజెక్టుల్లో బిజీ కావడంతో సినిమా పక్కకు పోయింది. రెండేళ్లకు డేట్స్ దొరికినా, బాలయ్య ఖాళీగా లేడు. ఇలా బాలీవుడ్ ఛాన్స్ మిస్సయింది.