MoviesTollywood news in telugu

నేచురల్ స్టార్ నాని రియల్ లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా?

Tollywood Hero Nani :అసిస్టెంట్ డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి, అష్టాచెమ్మా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని వరుస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ నేచురల్ స్టార్ అన్పించుకున్నాడు. సినిమాల్లో లవ్ స్టోరీ సహజమైన రియల్ లైఫ్ లో కూడా నానికి లవ్ స్టోరీ ఉందట. ఎందుకంటే అప్పట్లో నాని, అంజనా వీడియో బాగా వైరల్ అయింది.

అవును, అంజనాను ప్రేమించి 2012లో పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్న నానికి ఓ బాబు ఉన్నాడు. 2017లో పుట్టిన అతడికి అర్జున్ అని పేరు పెట్టారు. ఇక జెర్సీ మూవీలో నాని పాత్రపేరు కూడా అర్జున్ కావడం విశేషం.ఇంతకీ నాని లవ్ స్టోరీ ఎలా మొదలైందంటే, అంజనా ఎఫ్ ఎం లో పనిచేసేది.

ఆ సమయంలోనే అంజనా ప్రేమలో నాని పడిపోయాడు. లవ్ ట్రాక్ నడిపాడు. మొదట్లో ఫ్రెండ్షిప్ గా మొదలై ఆతర్వాత ఇద్దరి మధ్య లవ్ నడిచింది. ఇక అంజనను పికప్ చేసుకోడానికి నాని గంటల తరబడి వెయిట్ చేసేవాడట. అయితే ప్రేమ విషయం ఇంట్లో చెప్పాకా ఇరు కుటుంబాల వారు ఒప్పుకోవటంతో పెళ్లి జరిగిపోయింది.