MoviesTollywood news in telugu

అందగాడు హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలుసా…?

Tollywood Heroine heroine damini :ఇండస్ట్రీలోకి ఎందరో హీరోయిన్స్ వస్తుంటారు వెళుతుంటారు. కొందరే నిలదొక్కుకుంటారు. మరికొందరు క్యారెక్టర్ పాత్రలకు పరిమితం అవుతారు. ఇంకొందరు అయితే ఇండస్ట్రీ నుంచి దూరంగా జరిగిపోతారు. ఇప్పుడు మనం ప్రస్తావించే హీరోయిన్ కూడా తళుక్కున మెరిసి మాయమైంది. ఆమె ఎవరో కాదు దామిని. కన్నడ నటుడు ఉపేంద్ర 1999లో నటించిన ఉపేంద్ర మూవీతో అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ మూవీ తెలుగులో కూడా వచ్చింది.

అయితే ఈ సినిమా తర్వాత దామినికి పెద్దగా ఛాన్స్ లు రాలేదు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ నిలదొక్కుకోలేక పోయింది. కథల పరంగా, పాత్రల పరంగా శ్రద్ధ చూపించక పోవడం వల్లే ఇలా అయిందని టాక్. అయితే ఈమె నటించిన సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకోవడం కూడా ఈమెకు భవిష్యత్తు లేకుండా చేసిందని విశ్లేషకుల మాట.

పైగా డైట్ కంట్రోల్ లేకపోవడం వలన బరువు కూడా పెరగడం దామిని కి ఛాన్స్ లు తగ్గిపోవడానికి కారణంగా చెబుతుంటారు. తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 15సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి ఎక్కువ సినిమాలు ప్లాప్ అయ్యాయి. 2016లో స్వతంత్ర్య పాల్య మూవీలో 2016లో నటించాక మరల ఇండస్ట్రీలో కన్పించలేదు. అన్నట్టు తెలుగులో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన అందగాడు మూవీలో నటించడం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.