MoviesTollywood news in telugu

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ని గుర్తు పట్టారా…?

Music director thaman :గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అన్ని భాషల్లో 40వేలకుపైగా పాటలు పాడి,గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు.ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. అంతేకాదు, నటుడిగా కూడా 100కి పైగా సినిమాల్లో నటించారు. కరోనా మొదటి వేవ్ లో కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ఈలోకం విడిచివెళ్లిపోయారు.

ఇక ఎన్నో సినిమాలకు అద్భుతమైన బాణీలు అందిస్తూ,తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న మ్యూజిక్ డైరక్టర్ ఎస్ ఎస్ థమన్ గత ఏడాది సంక్రాంతికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అలవైకుంఠపురంలో మూవీతో అద్భుత సాంగ్స్ కంపోజ్ చేసి, బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారువారి పాట మూవీకి బాణీలు అందిస్తున్నాడు.

అలాగే నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ మూవీకి కూడా సంగీతం అందిస్తున్నాడు. అయితే తాజాగా థమన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. అది ఎస్పీ బాలుతో ఉన్న చిన్ననాటి ఫోటో. 1996లో లాస్ ఏంజిల్స్ వెళ్తున్నపుడు ఎయిర్ పోర్టులో తీసుకున్న ఫోటోగా థమన్ వివరించాడు. దీంతో పలువురు కామెంట్స్ పెడుతున్నారు. పైగా థమన్ అప్పుడు బొద్దుగా కూడా ఉన్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.