కాజల్ అగర్వాల్ గురించి ఆసక్తికర విషయాలు…ఎన్ని కోట్ల అస్థి…?
Tollywood Heroine kajal aggarwal : అగ్రహీరోల సరసన నటిస్తూ హిట్స్ అందుకుంటున్న చందమామ కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా నటించి అదరగొట్టింది. ఈ మధ్యే పెళ్లి కూడా చేసుకుని, ఆచార్య షూటింగ్ లో పాల్గొన్న కాజల్ వివరాల్లోకి వెళ్తే, 1985జూన్ 19న ముంబైలో వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్ దంపతులకు జన్మించిన కాజల్ కి నిషా అగర్వాల్ అనే సిస్టర్ ఉంది. కాజల్ ని కాజు, బేబీ అని నిక్ నేమ్స్ తో పిలుస్తారు. ముంబై సెయింటైన్స్ స్కూల్, జైహింద్ కాలేజీ, కేసి కాలేజీలలో స్టడీస్ పూర్తిచేసింది. మాస్ మీడియా స్పెషలైజేషన్ ఇన్ ఎడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ లో డిగ్రీ చేసింది.
ప్రస్తుతం 36ఏళ్ళ ఈ భామ గత ఏడాది అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లి అనే బిజినెస్ మ్యాన్ తో పెద్దల ఆశీర్వాదంతో ముంబై తాజ్ పేలస్ లో ఘనంగా పెళ్లయింది. చిన్ననాటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. అలాగే ఎంబీఏ చేసి,బిజినెస్ రంగంలోకి వెళ్లాలని కోరిక ఉండేది. కాలేజీ డేస్ లోనే మోడలింగ్ వైపు అడుగులు వేయడంతో 2004లో హిందీ మూవీ క్యూను హో గయానా లో నటించింది. 2008లో పజాని అనే తమిళ్ మూవీలో నటించింది. అయితే 2007కి నందమూరి కళ్యాణ్ రామ్ తో కల్సి లక్ష్మి కళ్యాణం మూవీలో చేసి,23లక్షల 50వేలు రెమ్యునరేషన్ తీసుకుంది.
అయితే చందమామ మూవీతో ఫార్మ్ లోకి వచ్చిన కాజల్ మగధీర మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. చాలామూవీస్ హిట్ గా నిలిచాయి.తాజాగా మంచు విష్ణుతో నటించిన మోసగాళ్లు మూవీకి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంది. ఈమె నెట్ వర్త్ 65కోట్లు.విజయ్, జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమైన హీరోలు. హేమమాలిని,ఐశ్వర్యారాయ్ ఇష్టమైన హీరోయిన్స్. చైనీస్,ఇటాలియన్ ఫుడ్ అంటే మక్కువ. డాన్స్,ట్రావెలింగ్,రీడింగ్ బుక్స్ అంటే హాబీస్.దుబాయ్ అంటే ఇష్టం. ఈమె ముంబైలో దాదాపు 6కోట్ల రూపాయల విలువైన మెరైన్ డ్రైవ్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటోంది.మూడు విలాసవంతమైన కార్లున్నాయి.

