MoviesTollywood news in telugu

అలనాటి హీరో నరసింహరాజు ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా?

Tollywood hero narasimharaju :సినిమా ఇండస్ట్రీ ఒక మాయా ప్రపంచం. ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో ఎప్పుడు ఎవరిని పడడోస్తుందో ఎవరికీ తెలీదు. హిట్స్ వచ్చినంత సేపు వెనుక తిరిగిన వాళ్ళు,ఒక్కసారిగా ప్లాప్ లు వస్తే, ఎవరూ పలకరించని పరిస్థితి వచ్చేస్తుంది. ఒకప్పుడు అగ్ర హీరోలకు సైతం పోటీ ఇచ్చి కూడా, ఆతర్వాత ఛాన్స్ లు లేక చతికిలబడిపోతారు. ఇలాంటి వాళ్లలో అలనాటి హీరో నరసింహరాజు ఒకరు. మెగాస్టార్ చిరంజీవి,సుమన్ తదితర నటులకు అప్పట్లో గట్టి పోటీ ఇచ్చిన జానపద హీరోగా పేరుతెచ్చుకున్నారు.

అంతెందుకు చిరంజీవి హీరోగా నటించిన పున్నమినాగు మూవీలో లో నరసింహరాజు కూడా హీరోగా చేసాడు. ఇక జానపద చిత్రాల్లో ఆరితేరిన బి విఠలాచార్య రూపొందించిన జగన్మోహిని మూవీతో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న నరసింహరాజు కి వరుస ఆఫర్లు వచ్చాయి. పలు జానపద చిత్రాలతో పాటు సాంఘిక చిత్రాల్లో కూడా నటించారు. ఇక కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు.

తెలుగుతో పాటు తమిళ,తదితర భాషల్లో 100కి పైగా సినిమాల్లో నటించిన నరసింహరాజు పలు సీరియల్స్ లో కూడా చేసారు. ముఖ్యంగా జెమిని టివిలో ప్రసారమయిన అమ్మాయి కాపురం,చక్రవాకం,బొమ్మరిల్లు,శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి ధారావాహిక సీరియల్స్ లో నటించి,ఇప్పుడు ఛాన్స్ లు కరువై ఇబ్బందులు పడుతున్నట్లు టాక్.