MoviesTollywood news in telugu

తెలుగు బుల్లితెరపై నటిస్తున్న సొంత అత్తా కోడళ్ళు…ఎంత మందో…?

Tollywood Serial Actors :అక్కా చెల్లెల్లు, అత్తా కోడళ్ల సెంటిమెంట్స్ తో తెలుగు బుల్లితెరపై చాలా సీరియల్స్ వస్తున్నాయి. అందులో అత్తా కోడళ్ల సెంటిమెంట్ సీరియల్స్ తీసుకుంటే వాటిలో వాళ్ళను చూసి వీళ్ళు రియల్ లైఫ్ లో కూడా సొంత అత్తాకోడళ్లు అయితే బాగుండుననే మాట వినిపిస్తుంది. నిజంగా అలా నటిస్తున్న సీరియల్స్ ఉండడం గమనార్హం. వాటి వివరాల్లోకి వెళ్తే, గత రెండు దశాబ్దాలుగా యాంకర్ గా దుమ్మురేపుతున్న సుమ మొదట్లో సీరియల్స్ లో నటించింది.

గీతాంజలి, అన్వేషిత వంటి సీరియల్స్ లో నటించిన సుమ మంచి పేరుతెచ్చుకుని ఆతర్వాత యాంకర్ గా మారింది. ఇక ఆమె భర్త రాజీవ్ కనకాల తల్లి,సుమ అత్తగారు లక్ష్మి కనకాల కూడా కొన్ని సీరియల్స్,సినిమాల్లో నటించారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి,ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తున్న సన మంచి పేరు తెచ్చుకుంది. ఈమె కొడుకు అన్వర్ కూడా తెలుగు,తమిళ సీరియల్స్ లో నటిస్తున్నాడు. అన్వర్ భార్య సమీరా కూడా బుల్లితెరపై ముద్దుబిడ్డ,ఆడబిడ్డ వంటి సీరియల్స్ లో నటించింది. టివి షోస్ లో కూడా మంచి ఫాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.

ఇలా అత్తా కోడళ్ళు సన, సమీరా సీరియల్ నటులే. ఇద్దరు కల్సి పలు సీరియల్స్ లో నటించారు. సంతోషిణి ఎన్నో సీరియల్స్ లో నటించి , వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఈమె మామ ప్రసాద్ బాబు ఎన్నో సినిమాల్లో చేసి,బుల్లితెరపై నటించారు. ఈయన భార్య కూడా సీరియల్స్ లో నటించింది. ఇక నటి శ్రీలక్ష్మి ఎన్నో సినిమాల్లో నటించి,ఆతర్వాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈమె తమ్ముడు రాజేష్ ఒకప్పుడు నటుడు.అతడి కూతురు ఐశ్వర్య రాజేష్ కూడా కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్స్ వంటి హిట్ మూవీస్ లో చేసింది. శ్రీలక్ష్మికి ఈమె స్వయానా మేనకోడలు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."