MoviesTollywood news in telugu

2000లో వరుస హిట్స్ కొట్టిన శ్రీకాంత్…ఎన్ని హిట్స్…?

srikanth Hit Movies :విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి,తాజ్ మహల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ కెరీర్ లో 2000 సంవత్సరం చాలా కీలకం. 8సినిమాలతో వచ్చి ప్లాప్ లేకుండా నిలబడ్డాడు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం లతో కల్సి చేసిన క్షేమంగా వెళ్లి లాభంగా రండి మూవీ ఫిబ్రవరి 4న రిలీజయింది. రాజా వన్నెం రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కామెడీతో బాగా పండింది. రోజా,ప్రీతి,కోవై సరళ వీరికి జంటగా నటించారు.

దీని తర్వాత ఫిబ్రవరి 18న వచ్చిన చాలా బాగుంది మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది. వడ్డే నవీన్ తో కల్సి స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రీకాంత్ సరసన మాళవిక నటించింది. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీతో ఎల్ బి శ్రీరామ్ కమెడియన్ గా ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.

రాజా వన్నెం రెడ్డి డైరెక్షన్ లోనే చూసొద్దాం రండి మూవీ ఆగస్టు 18న రిలీజయింది. జగపతి బాబుతో కల్సి శ్రీకాంత్ నటించిన ఈ మూవీ కి కీరవాణి స్వరాలు సమకూర్చారు. ఇలా మల్టీస్టారర్ మూవీలతో హిట్స్ అందుకుంటున్న శ్రీకాంత్ ఏకంగా నాగార్జునతో కల్సి నిన్నే ప్రేమిస్తా మూవీ లో నటించాడు. సౌందర్య హీరోయిన్ గా చేసింది. నాగ్ గెస్ట్ రోల్. ఎస్ ఏ రాజ్ కుమార్ పాటలు అందించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిల్చింది. ఆర్ ఆర్ షిండే డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 14న రిలీజయింది.

ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో శ్రీకాంత్ హీరోగా ఎల్ బి శ్రీరామ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఆమ్మో ఒకటో తారీఖు. రాశి హీరోయిన్.
మధ్యతరగతి ప్రజల ఆశలు,కష్ఠాలు ఎలా ఉంటాయో చూపిస్తూ తీసిన ఈ మూవీ అక్టోబర్ 20న రిలీజయింది. ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న ఈ మూవీ పలు అవార్డులను తెచ్చిపెట్టింది. శ్రీకాంత్ కి 100డేస్ ఫంక్షన్ చూపించిన సినిమా తిరుమల తిరుపతి వేంకటేశ.

డిసెంబర్ 21న రిలీజైన ఈ మూవీలో శ్రీకాంత్,రవితేజ,బ్రహ్మానందం లు కల్సి నటించారు. ఈ మల్టీస్టారర్ మూవీ తర్వాత సకుటుంబ సపరివార సమేత మూవీ కూడా అదేరోజు రిలీజయింది. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఏవరేజ్ టాక్ ఇచ్చింది. ఇక కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన దేవుళ్ళు మూవీలో అందరి బంధువయా సాంగ్ లో రాముడిగా శ్రీకాంత్ నటించి మంచి మార్కులు కొట్టేసాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."