MoviesTollywood news in telugu

నాపేరు మీనాక్షి సీరియల్ అగర్వాల్ క్యారెక్టర్ కి గుడ్ బై…కారణం ఇదే…!

Naa peru meenakshi serial agarwal character :ఈటీవీలో ప్రసారమవుతున్న నాపేరు మీనాక్షి సీరియల్ మంచి క్రేజీగా నడుస్తోంది. ఎందుకంటే దాదాపు ఆరేళ్ళ నుంచి మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తోంది. స్టోరీ నడిచేకొద్దీ పాత్రలకు తగ్గట్టు డైరెక్టర్ చేంజెస్ చేస్తూ వస్తున్నాడు. దీంతో ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. దీంతో కొందరు ఆర్టిస్టులకు స్వాగతం పలుకుతూ,కొందరికి గుడ్ బై చెబుతున్నారు.

మీనాక్షి క్యారెక్టర్ నవ్యస్వామి తప్ప మిగిలినవారు మారిపోతున్నారు. క్రిష్ పాత్రను ఎండ్ చేయడంతో సీరియల్ ముగుస్తుందని భావించారు. కానీ మంచి సక్సెస్ రేటుతో నడుస్తోంది. రీసెంట్ గా గౌతమీ పాత్రను తొలగించారు. ఇక విజయవంతంగా విలన్ పాత్రలో అగర్వాల్ కొనసాగింది. అయితే సీరియల్ కి అనుగుణంగా ఈ పాత్రను తొలగిస్తారని అంటున్నారు. దీంతో అగర్వాల్ క్యారెక్టర్ ముగిసినట్టే.

సోషల్ మీడియా వేదికగా అగర్వాల్ పాత్రధారి అను పొన్నప్ప ఈ విషయాన్ని షేర్ చేసింది. నేను యాక్ట్ చేసినన్ని రోజులు నన్ను తిట్టని రోజు లేదు. అంతలా ఆదరించారు అంటూ ఆమె పేర్కొంది. ‘ఈ పాత్ర నాకు బాగా సూటయింది. నెగెటివ్ షేడ్ రోల్ బాగా నచ్చింది. అందుకే మంచి పాపులార్టీ వచ్చింది. ఆదరించినవాళ్లకు ధన్యవాదాలు. సీరియల్ లో నటించేవాళ్లకు శుభాభినందనలు. నా పాత్ర ముగిసినా ట్విస్ట్ లతో ఈ సీరియల్ మరింతగా ప్రజాదరణతో ముందుకు సాగాలని ఆకాంక్ష. త్వరలోనే మరో సీరియల్ తో ఆడియన్స్ మందికి వస్తా . థాంక్స్’అంటూ పోస్ట్ చేసింది.