గౌరమ్మ సీరియల్ యాక్టర్ కార్తీక్ రియల్ లైఫ్…అసలు నమ్మలేరు
Gowramma serial actor karthik :బుల్లితెరమీద పలు సీరియల్స్ వస్తున్నాయి. ఒక్కో సీరియల్ కి ఒక్కో రేంజ్ లో ఆడియన్స్ ఆదరణ ఉంటోంది. కొన్ని సీరియల్ అయితే టాప్ మోస్ట్ సీరియల్ గా టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. ఇక ఈటీవీలో ప్రసారమవుతున్న గౌరమ్మ సీరియల్ ప్రారంభమైన కొద్దిరోజులకే జనానికి బాగా కనెక్ట్ అయింది. మంచి ఆదరణ లభిస్తోంది. నటీనటులు తమ అందంతో, అభినయంతో అలరిస్తున్నారు.
ఈ సీరియల్ లో కార్తీక్ పాత్రలో నటిస్తున్న వ్యక్తి తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. తొలిసిరియల్ అయినప్పటికీ మంచి నటన కనబరుస్తున్నాడు. అతడి పేరు చక్రవర్తి రెడ్డి. కర్ణాటకలోని బెంగళూరులో జనవరి 19న జన్మించాడు. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కన్నాడు.
దీనికి అనుగుణంగా మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన చక్రవర్తి పలు ఫోటో షూట్స్, యాడ్స్ లో నటించాడు. అలాగే కన్నడలో యాన, భావచిత్ర మూవీస్ లో నటించాడు. దాంతో మంచి గుర్తింపు లభించింది. అలాగే కన్నడ వీడియోస్ లో కూడా నటించాడు. మ్యూజిక్ ఆల్బమ్స్ లో చేసాడు. ఫొటోగ్రఫీ అంటే మక్కువ గల చక్రవర్తి ప్రస్తుతం గౌరమ్మ సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతున్నాడు.

