గుప్పెడంత మనసు యాక్టర్ శిరీష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు
Gupedhantha manasu serial sireesh : బుల్లితెరమీద వస్తున్న సీరియల్స్ లో తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన గుప్పెడంత మనసు సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ తో నడుస్తోంది. ఇందులోని నటీనటులు తమ అందంతో,అభినయంతో ఆకట్టుకుంటున్నారు. నటీనటులు మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఇందులోకి శిరీష్ పాత్ర ఎంటర్ అయింది. శిరీష్ పాత్రలో నటిస్తున్న నటుడి పేరు ఆదర్ష్. యితడు ఎన్నో సీరియల్స్ లో నటించి పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులోనే పుట్టి పెరిగి, అక్కడే స్టడీస్ కూడా పూర్తిచేసిన ఆదర్ష్ కి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. దీంతో స్కూల్, కాలేజీ డేస్ లో ఎన్నో స్టేజి ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నాడు. సీరియల్ నటుడిగా ఉంటూ కూడా ఖాళీ సమయంలో డాన్స్ వీడియోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తున్నాడు. జెమినిలో డాన్స్ బేబీ డాన్స్, ఈటీవీలో ఢీ 2 డాన్స్ షోలో చేసాడు. జెమినిలో కిమ్ కామెడీ,డాన్స్ షోలో కూడా యితడు పాల్గొన్నాడు.
అదే సమయంలో తమిళ మూవీలో నటించే ఛాన్స్ రావడంతో అందులో నటించాడు. అయితే షూటింగ్ పూర్తయినా కూడా అనివార్య కారణాలతో ఆ మూవీ రిలీజ్ కాలేదు. అలా నటనమీద ఆసక్తి పెరగడంతో డాన్స్ చేస్తూనే సీరియల్స్ లో ట్రై చేసాడు. ఆకాశ గంగ సీరియల్ తో బుల్లితెరమీద ఎంట్రీ ఇచ్చాడు. 2016లో మస్తాను ప్రేమించి పెళ్లిచేసు కున్నాడు. అభిషేకం, అమెరికా అమ్మాయి,అగ్నిపూలు,వరూధిని పరిణయం,గృహప్రవేశం, స్వాతి చినుకులు,మీనాక్షి,అగ్నిసాక్షి వంటి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.