ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా…?

Tollywood heroine Megha Akash :సినిమా నటీనటులు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ,తమ ఫోటోలు,అభిప్రాయాలూ షేర్ చేసుకుంటున్నారు. దాంతో తమ చిన్ననాటి ఫోటోలు, జ్ఞాపకాలను షేర్ చేస్తున్నారు. దీంతో ఇవి బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా హీరోయిన్ మేఘ ఆకాష్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో చాలా క్యూట్ గా ఉన్నావంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఈ మలయాళీ బ్యూటీ ‘లై’ మూవీ ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు.

అయితే మేఘ ఆకాష్ నటనకు మంచి మార్కులు పడడంతో ఛాన్స్ లు బాగానే వచ్చాయి. నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందించిన చల్ మోహన్ రంగా మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుని మంచి పేరు తెచ్చుకుంది. ఈ మూవీ ఏవరేజ్ గా నిల్చింది. దాంతో ఈమెకు తెలుగులో ఛాన్స్ లు రాకున్నా,మలయాళం,తమిళ భాషల్లో మంచి ఛాన్స్ లు వచ్చాయి.

అందం,అభినయం మెండుగా ఉన్న మేఘ ఆకాష్ ప్రస్తుతం యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా నటిస్తున్న మనుచరిత్ర మూవీలో చేస్తోంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు టాక్. ఇక ఈమెకు సోషల్ మీడియాలో 28లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. అందుకే ఆమె చైల్డ్ ఏజ్ ఫోటోకి ఒక్కరోజులోనే మూడు లక్షల లైక్ లు, కామెంట్స్ వచ్చాయి.