కేరాఫ్ అనసూయ సీరియల్ యాక్టర్ రాయుడు రియల్ లైఫ్…అసలు నమ్మలేరు
Care Of anasuya serial actor rayudu :బుల్లితెరపై సీరియల్స్ కి మంచి క్రేజ్ ఉంది. దీంతో నటీనటులకు కూడా పాపులార్టీ వస్తోంది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కేరాఫ్ అనసూయ సీరియల్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ విజయవంతంగా నడుస్తోంది. ఇందులో నటిస్తున్న రాయుడు పాత్రధారి తన అందంతో నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. ఇతడి అసలు పేరు ఏక్ నాధ్ గోపీకుమార్ పరుచూరి.
ఇతడిని ఏక్ అని కూడా ముద్దుగా పిలుస్తారు. 1995నవంబర్ 8వ తేదీన జన్మించిన ఏక్ నాధ్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ దగ్గర చల్లపల్లి గ్రామంలో జన్మించాడు. ఇతడికి ఓ సిస్టర్ ఉంది. రవీంద్ర భారతి స్కూల్, ఏన్ ఆర్ ఐ కాలేజ్,లయోలా డిగ్రీ కాలేజీలో స్టడీస్ పూర్తిచేసాడు. చిన్ననాటి నుంచి నటన పట్ల ఆసక్తి ఉండడంతో స్టడీ పూర్తయ్యాక షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో చేసాడు.
జతకలిసే,లేడీ రోమియో,నీది నాది ఒకే కథ,ఐ హేట్ బ్రేకప్,అంతం కాదిది ఆరంభం,లవ్ చేయాలా వద్దా, యుద్ధం చేయరా ప్రేమికా,సూసైడ్, హౌ టు ఇంప్రెస్ వంటి దాదాపు 30కి పైగా షార్ట్ ఫిలిమ్స్ లో చేసాడు. ఇక ఈటివి ప్లస్ లో నేను శైలజ సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఏక్ నాధ్ కి ఈ సీరియల్ తో మంచి ఫాన్ ఫాలోయింగ్ లభించింది. ప్రస్తుతం ఈటివి ప్లస్ లో సీతా సమేత రామ సీరియల్ తో పాటు, స్టార్ మాలో కేరాఫ్ అనసూయ సీరియల్స్ లో నటిస్తున్నాడు.

