MoviesTollywood news in telugu

అతిధి మూవీ డిజాస్టర్ కావటానికి కారణాలివే…అసలు నమ్మలేరు

Athidhi Movie Failure Reasons :సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిధి మూవీ 2007అక్టోబర్ 18న విడుదలై,ఫాన్స్ ని నిరాశ పరిచింది.ఇక ఆడియన్స్ కి కూడా నచ్చక పోవడంతో ప్లాప్ అయింది. అయితే ఇప్పుడు చూస్తే సూపర్ గా ఉంటుంది. దీనికి అనేక కారణాలున్నాయి.సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో స్టైలిష్ గా తీసిన అతిధి మూవీ భారీ అంచనాల నడుమ రిలీజై, డిజాస్టర్ గా నిల్చింది. సూపర్ స్టార్ హోదా వచ్చాక ఒప్పుకున్న మూవీ కావడం,బాలీవుడ్ హీరోయిన్ అమృతారావు హీరోయిన్ కావడం, బాలీవుడ్ ప్రొడక్షన్స్ యుటివి భాగ స్వామ్యం కావడం ఇలా వివిధ కారణాలతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది.

దాదాపు 20కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ వరల్డ్ వైడ్ 712థియేటర్లలో విజయదశమి శుభాకాంక్షలతో రిలీజయింది. అయితే ఈ మూవీ ఫాన్స్ అంచనాలను రీచ్ కాలేదు. మొదటి భాగం సూపర్ గా ఉంటుంది.మహేష్ ఎంట్రీ,సిగరెట్ షేరింగ్ ఫైట్ అన్నీ అదిరిపోయాయి. సెకండాఫ్ లో హీరోయిన్ ని బైక్ మీద వెళ్లి సేవ్ చేయడం వంటి సీన్లు బాగుంటాయి. సత్యం ఏమిటో సాంగ్ చిత్రీకరణ అదిరింది. మహేష్ హెయిర్ స్టైల్ అప్పట్లో అలరించింది. సురేంద్రరెడ్డి టేకింగ్,మణిశర్మ సంగీతం అన్నీ సూపర్భ్. తొలివారం రికార్డ్ ఓపెనింగ్స్ సాధించిన ఈ మూవీ చివరకు డిజాస్టర్ అయింది. రిచ్ గా తీసిన ఈ మూవీ 3గంటలపాటు సాగడం మైనస్ అయింది. మొదటి భాగం బాగున్నా, సెకండాఫ్ బోర్ కొట్టేలా చేసింది.

హీరోయిన్ ని సేవ్ చేయడం ప్రధాన ఇతివృత్తం. కానీ మధ్యలో కొన్ని అనవసర సన్నివేశాలు పెట్టారు. ఐటెం సాంగ్ కూడా తీసెసి, 2 గంటల 20 నిమిషాలకు కుదించవచ్చు. క్లైమాక్స్ లో చిన్నపాప చనిపోవడం, హెవీ వయలెన్స్ మనకు జీర్ణం కాని అంశం. దాంతో మూవీ చూసి బయటకు వచ్చాక ఫీల్ గుడ్ అనిపించదు. ఇక కామెడీ మిస్ అయింది. స్కోప్ ఉన్నా కామెడీ పండించే సీన్స్ లేవు.సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. హీరోయిన్ కూడా మైనస్ అయింది. పోకిరి వచ్చి ఏడాదిన్నర అయినా సరే, అదే మూడ్ లో ఫాన్స్ ఉన్నారు. తీరా అతిధి లో అలాంటి ఎంటర్ టైన్మెంట్ మిస్సయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."