బుల్లితెరపై మెగాస్టార్…ఆ సీరియల్ మీరు చూసారా…?
Megastar chiranjeevi acted in hindi serial :పునాదిరాళ్ళు మూవీతో ఎంట్రీ ఇచ్చి, ప్రాణం ఖరీదు మూవీతో టాలీవుడ్ స్క్రీన్ మీద కన్పించిన చిరంజీవి మొదట్లో నెగెటివ్ షేడ్ గల పాత్రల్లో నటించి మెప్పించారు. తర్వాత హీరోగా ఎదిగి, మెగాస్టార్ రేంజ్ కి చేరుకున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి ఎంతోమంది నటీనటులు ఆదర్శం. అయితే వెండితెరను షేక్ చేసిన చిరంజీవి బుల్లితెరపైనా సందడి చేశారట.
సెలబ్రిటీల విషయాలను వెలికితీస్తూ, సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు చిరంజీవి బుల్లితెర మీద కూడా కన్పించిన విషయం చక్కర్లు కొడుతోంది. సూపర్ హిట్ మూవీస్, ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అందుకున్న చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. కానీ బుల్లితెరమీద నటించిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
దాదాపు 152 చిత్రాల్లో నటించి,తాజాగా ఆచార్య సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు దూరదర్శన్ లో ప్రసారమైన రజని అనే సీరియల్ లో తళుక్కున మెరిసారట. ధారావాహికంగా ప్రసారమైన ఈ సీరియల్ లో ఒకే ఒక ఎపిసోడ్ లో గెస్ట్ గా వచ్చిన చిరంజీవి ఆతర్వాత సినిమాల్లో ఛాన్స్ తో సీరియల్ కి దూరంగా జరిగారు. తెలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ తో ఇప్పటికీ అగ్ర హీరోగా వెలుగొందుతున్నారు.

