MoviesTollywood news in telugu

ఒకప్పటి ఈ విలన్ ఎలా చనిపోయాడో తెలుసా…చివరి రోజుల్లో ఎలా…?

Tollywood Villain Tiger Prabhakar :తెలుగు,కన్నడ,హిందీ భాషల్లో నెగెటివ్ రోల్స్ లో ఒకప్పుడు సత్తా చాటిన కన్నడ ప్రభాకర్ అనగానే భయంకరమైన విలన్ గుర్తుకు వస్తాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన రాక్షసుడు వంటి చిత్రాల్లో విలన్ గా అదరగొట్టిన కన్నడ ప్రభాకర్ పలు అగ్ర హీరోల సినిమాల్లో విలన్ గా మెప్పించాడు. అయితే ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని, ముగ్గురికీ విడాకులు ఇచ్చేసాడు. తర్వాత మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళలేదు.

అందాల నటుడు శోభన్ బాబు హీరోగా నటించిన ప్రతీకారం మూవీలో విలన్ గా నటించి, టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రభాకర్ ఆ తర్వాత టైగర్ సినిమాలో నటించి టైగర్ ప్రభాకర్ అయ్యాడు. కానీ చాలామంది కన్నడ ప్రభాకర్ అనే వ్యవహరించేవారు. అద్భుతమైన విలనిజాన్ని పండించిన ప్రభాకర్ దాదాపు 300సినిమాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు.

కన్నడ ప్రభాకర్ కి పెళ్లయినప్పటికీ 1985లో ప్రముఖ నటి, రాజకీయ నేత జయమాలను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆతర్వాత విబేధాలు రావడంతో 1988లో విడిపోయారు. సీరియల్స్,సినిమాల్లో నటించిన కన్నడ నటి అంజు ని 1995లో మూడో పెళ్లి చేసుకుని, ఏడాదిలోగానే విభేదాలతో విడిపోయాడు. చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా చేసిన కన్నడ ప్రభాకర్ విలన్ గా ఓ వెలుగు వెలిగాడు.

2000 వ సంవత్సరం నుంచి అనారోగ్య సమస్యలు రావటంతో 2001 వ సంవత్సరం మార్చి 25 న జాండిస్ వ్యాధి బారిన పడి మరణించాడు. చివరి రోజుల్లో చూసేవాళ్ళు లేక తీవ్ర మనస్తాపంతో మరణించాడు.