MoviesTollywood news in telugu

అలనాటి హీరోయిన్ తులసి ఆసక్తికర లవ్ స్టోరీ…అసలు నమ్మలేరు

Tollywood Actress Tulasi : సినిమాల్లో ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు ఉన్నా అందులో చాలా వరకూ బ్రేక్ అవ్వడం, విడాకులకు వెళ్లడం చూస్తుంటాం. కొందరు నిజమైన ప్రేమికులుగా పెళ్లి తర్వాత కూడా కొనసాగుతారు. అందులో నటి తులసి ఒకరు. ఈమె ప్రేమ విచిత్రమైనది. ఉదయం ప్రేమించి సాయంత్రం పెళ్లి పీటలు ఎక్కింది. కళాతపస్వి కె విశ్వనాధ్ తీసిన శంకరాభరణం మూవీలో మంజుల కొడుకుగా చైల్డ్ ఆర్టిస్టుగా అద్భుతమైన నటన కనబరిచింది.

ఆతర్వాత చాలా సినిమాల్లో నటించి,పెద్దయ్యాక హీరోయిన్ గా కూడా పలు చిత్రాల్లో చేసిన తులసి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అమ్మా, అత్తా పాత్రలతో అలరిస్తోంది. 1995లో మదర్ ఇండియా మూవీలో నటించడానికి చెన్నై వెళ్ళినపుడు సెల్వమణిని చూసి, ప్రేమలో పడిందట. సాయంత్రం గుళ్ళోకి వెళ్లి పెళ్లి చేసుకుంది.

ఈ విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి ఆశ్చర్యపరిచింది. మొదటి నుంచి సిగరెట్ అలవాటు గల సెల్వమణి తనకోసం సిగరెట్ మానేశాడని తులసి చెప్పుకొచ్చింది. తమ అనుబంధాన్ని షేర్ చేసుకుంటూ, తమది అపురూపమైన దాపంత్య జీవితమని చెప్పింది.