MoviesTollywood news in telugu

మాస్ట్రో సినిమాలో ఒక్క పాట కోసం ఎంత ఖర్చు పెట్టారో…?

maestro movie : జయం మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి, బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో నితిన్‌ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఈ మధ్య కొన్ని ప్లాప్ లు ఎదుర్కొన్నప్పటికీ కరోనాకు ముందు భీష్మ మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. తాజాగా డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న మాస్ట్రో సినిమాలో హీరోగా చేస్తున్నాడు.

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ అంధాదున్‌కు రీమేక్‌ గా వస్తున్న ఈ మూవీలో నితిన్‌కు నభా నటేశ్ జోడీ కడుతోంది. హిందీలో’టబు’ చేసిన పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర అంశం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మూవీలో ముఖ్యమైన పాత్రలు పోషించిన నటీనటులపై హైదరాబాద్‌లో ప్రత్యేకంగా భారీ సెట్‌ వేసి మరీ ఓ స్పెషల్‌ సాంగ్‌ షూట్‌ చేశారట. ఈ ఒక్క పాట కోసమే దాదాపు రూ. 50 లక్షలు ఖర్చు పెట్టినట్లు ఫిల్మ్ నగర్‌ లో వినిపిస్తోంది. సినిమా ప్రమోఫన్స్‌లో ముఖ్యంగా ఈ పాటనే వాడతారట. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమా త్వరలో రిలీజ్ చేస్తారట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."