తేనె మనసులు సినిమా గురించి నమ్మలేని నిజాలు…కృష్ణ పారితోషికం…?

Superstar Krishna Tene Manasulu Movie :ఎన్నో విశేషాలు గల తేనెమనసులు టాలీవుడ్ కి సూపర్ స్టార్ ని అందించింది. ఎల్వి ప్రసాద్ 1962లో కొడుకులు,కోడళ్ళు మూవీకోసం హీరో కృష్ణను తీసుకున్నారు. అయితే ఆ మూవీ నిర్మాణాన్ని అనివార్య కారణాల వలన విరమించు కున్నారు. 1963లో ఓ తమిళ మూవీలో హీరోగా ఛాన్స్ వచ్చినా, భాష రాకపోవడం వలన ఆ ఛాన్స్ కూడా పోయింది. ఇక డబ్బులు లేక సొంతూరు బుర్రిపాలెం వచ్చేసాడు. ఈలోగా బాబు మూవీస్ కొత్త నటులతో మూవీకి రెడీ అయింది. మూగమనసులు,మంచి మనసులు తర్వాత తీయబోయే చిత్రం కోసం ఆడిషన్స్ పెడితే,5వేల ఫోటోలు వచ్చాయి. అందులో కృష్ణ కూడా ఉన్నాడు. 15రోజుల తర్వాత టెస్ట్ కి రావాలన్న ఉత్తరం వచ్చింది. టెస్ట్ అయ్యాక ఊరెళ్ళిపోయాడు.

ఇది జరిగిన కొన్నాళ్ళకు సెలక్ట్ అయినట్లు ఉత్తరం రావడంతో ఊరంతా తెలిసిపోయింది. ఆడిషన్స్ కి హేమమాలిని,జయలలిత కూడా వచ్చినా, రాజమండ్రికి చెందిన సుకన్య,విజయవాడకు చెందిన సంధ్యారాణి సెలక్ట్ అయ్యారు.రామ మోహన్ ఒక హీరోగా, మరోహీరోగా కృష్ణను అనుకోవడంతో కృష్ణ మద్రాసు బయలుదేరాడు.

అదే కంపార్ట్ మెంట్ లో మహానటుడు ఎస్వీఆర్ ఉన్నారు. ఆయన్ని తేరిపారా చూడ్డంతో ఏమిటి అలా చూస్తున్నావని అడగడం, సినిమా కోసమని వివరాలు చెప్పడంతో మంచి డైరెక్టర్ చేతిలో పడ్డావ్ మంచి భవిష్యత్తు ఉంటుందని ఎస్వీఆర్ అన్నారు. మార్చి 16న షూటింగ్ స్టార్ట్. కె విశ్వనాధ్ కో డైరెక్టర్. నిజానికి హీరోలు దొరక్కపోతే విశ్వనాధ్ ని హీరోగా పెట్టి సినిమా తీయాలని ఆదుర్తి భావించారట.

తేనెమనసులు మూవీలో నటీ నటుల చేత ముందే మద్రాసులో ఆదుర్తి రిహార్సల్స్ చేయించారు. పిక్నిక్ లకు తీసుకెళ్లి వాళ్ళల్లో భయం పోగొట్టారు. ఊటీ,తదితర చోట్ల షూటింగ్ చేసారు. బైక్ నుంచి కారుని ఛేజ్ చేసే సీన్ డూప్ లేకుండా కృష్ణ చేసారు. మొదట్లో బ్లాక్ &వైట్ లో తీసినా,ఆరేడు రీళ్లు తీసాక కలర్ కి చేంజ్ అయ్యారు. దాంతో కృష్ణ తొలిచిత్రమే కలర్ లో వచ్చింది.

రెండు వేలు కృష్ణకు పారితోషికంగా ఇచ్చి, టైటిల్స్ లో ఘట్టమనేని శివరామకృష్ణ బదులు కృష్ణ గా వేశారు. 1965మార్చి 31న రిలీజయింది.23 సెంటర్స్ లో 50రోజులు, 3చోట్ల 100డేస్ ఆడింది. ఈ సినిమాతోనే బస్సులో ఊరూరా విజయ యాత్రలు స్టార్ట్ చేసింది ఈ సినిమాతోనే.నిజానికి ఈ సినిమాతో రామ్మోహన్ కి పేరు వచ్చింది.

కానీ కృష్ణ అనూహ్యంగా సూపర్ స్టార్ అయ్యాడు. విజయవాడ అలంకార థియేటర్ లో 100డేస్ వేడుకను జనం మధ్య కూర్చుని కృష్ణ తిలకించారు. 12మంది కొత్త నటులు పరిచయం కాగా, రాధాకుమారి మంచి నటిగా నిలిచింది. నటిగా చేసిన రోజా రాణి దూరదర్శన్ కి వెళ్ళిపోయి, అక్కడ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ ని పెళ్లిచేసుకుంది. ఇందులో సుకన్య, కృష్ణలపై తీసిన సాంగ్ కి పి సుశీల,పద్మనాభం ప్లే బ్యాక్ పాడారు.