MoviesTollywood news in telugu

వైష్ణవ్ తేజ్ హీరోయిన్ బుల్లితెర కోసం పారితోషికం ఎంత తీసుకుందో…?

Tollywood Heroine Kruthi Shetty : అది తమిళమైనా,కన్నడ అయినా, హిందీ అయినా, తెలుగు అయినా సరే, ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ కొడితే చాలు ఇక ఆ హీరోయిన్ కి క్రేజ్ మాములుగా ఉండదు. వరుస ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తాయి. దాంతో డేట్స్ ఎడ్జెస్ట్ మెంట్ కష్టం అవుతుంది. అందుకు తగ్గట్టుగా రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిపోతుంది. సరిగ్గా ఇప్పుడు ఉప్పెన మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న కృతి శెట్టి కి అలానే ఆఫర్స్ వస్తున్నాయి.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ నటించిన ఉప్పెన మూవీ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్ గా చేసిన కృతికి అమాంతం క్రేజ్ పెరిగింది. వరుస ఆఫర్స్ వస్తున్నాయి. బెంగళూరులో పుట్టి ముంబయిలో పెరిగిన ఈ అమ్మడు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న నానుడికి అనుకుగుణంగా ఆచితూచి సినిమాలను సెలక్ట్ చేసుకుని మరీ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

అంతేకాదు, జి తెలుగులో ప్రసారమయ్యే కొత్త సీరియల్ లో మెరిసిన కృతి,త్వరలో అదే ఛానల్ లో ప్రసారమయ్యే ఈవెంట్స్ లో కూడా కన్పించ బోతోందట. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఛానల్స్ తో అగ్రిమెంట్ చేసుకోవడం గ్రేట్. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రమ్యకృష్ణ వంటి వాళ్ళు కూడా ఇలాగే చేసారు. అయితే కృతికి రెమ్యునరేషన్ ఏకంగా కోటి రూపాయలు ఇస్తున్నారట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."