MoviesTollywood news in telugu

హరీష్ శంకర్ కెరీర్ లో హిట్ సినిమాలు…మీరు చూశారా…?

Tollywood director Harish Shankar Hit Movies :పలు హిట్ మూవీస్ అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుని స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఆయా హీరోల ఫాన్స్ కోరుకున్న అంశాలు జోడించి సినిమాలు చేసి హిట్ కొట్టడంలో దిట్ట అయ్యాడు.  మాస్ మహారాజ్ రవితేజను అభిమానులు మెచ్చేవిధంగా చూపించిన సినిమా మిరపకాయ్. లవ్, కామెడీ, మాస్ ఎనర్జీతో తీసిన ఈ మూవీ 2011లో వచ్చింది. మ్యూజిక్ అందించిన  థమన్ కూడా వరుస ఆఫర్స్ అందుకున్నాడు.

ఇక  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఖుషి తర్వాత భారీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్. ఇతడి డైరెక్షన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ రికార్డులను తిరగరాసింది. పవన్ ఫాన్స్ కోరుకునే అన్ని అంశాలను జోడించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఘనత  హరీష్ శంకర్ దే.కామెడీ తో పాటు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర ద్వారా పవన్ ఫాన్స్ ని అలరించారు. ఈ మూవీతో శృతి హాసన్ కి కూడా మంచి బ్రేక్ వచ్చింది.నాకు తిక్కుంది, దానికో లెక్కుంది అనే ఊర మాస్ డైలాగ్ జనంలోకి దూసుకెళ్ళింది. బండ్ల గణేష్ నిర్మించిన ఈ మూవీ 2012లో రిలీజయింది.

మెగా మేనల్లుడు సాయిధర్మ తేజ్ ని హీరోగా పెట్టి, రెజీనా ను హీరోయిన్ గా ఎంచుకుని లవ్ స్టోరీగా తీసిన మూవీ  సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సుమన్, నాగబాబు కీలక పాత్రలు పోషించారు. బ్రహ్మానందం కామెడీ అదిరింది. 2015లో ఇది రిలీజయింది.

2017లో వచ్చిన  దువ్వాడ జగన్నాధం మూవీ హరీష్ కెరీర్ లో మరో మైలురాయి. బన్నీ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా అలరించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఒక పక్క వంటలు చేసుకునే బ్రాహ్మణుడిగా, మరోపక్క  దుర్మార్గుల పాలిట డీజే గా బన్నీ నటన సూపర్భ్. వందకోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

కాగా  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో తీసిన గద్దలకొండ గణేష్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. 2019లో ఈ మూవీ వచ్చింది.  పూజా హెగ్డే హీరోయిన్. దేవత మూవీలో వెల్లువొచ్చి గోదారల్లే సాంగ్ రీమిక్స్ అదిరిపోయింది.