MoviesTollywood news in telugu

శ్రీమంతుడు సీరియల్ నటి కార్తీక చేస్తున్న జాబ్ ఏమిటో తెలుసా?

Srimanthudu serial actress karthika : ఈటీవీలో విజయవంతంగా నడుస్తూ ప్రేక్షకాదరణ పొందుతున్న శ్రీమంతుడు సీరియల్ లో నటీనటులు తమ నటనతో,అందంతో ఆకట్టుకుంటున్నారు. ఇక ఇందులో కార్తీక తన అందంతో పాటు అమాయకపు నటనతో అలరిస్తూ,ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. తనకంటూ పాపులార్టీ తెచ్చుకున్న కార్తీక అసలు పేరు నైనీషా రాయ్.

కోల్ కత్తాలో జన్మించిన నైనీష తండ్రి లెక్చరర్. తల్లి గృహిణి. ఈమెకు ఒక బ్రదర్, ఒక సిస్టర్ ఉన్నారు. బెంగాలీ అయినప్పటికీ తెలుగు స్పష్టంగా మాట్లాడడం విశేషం. చిన్న నాటి నుంచి యాక్టింగ్ అంటే మక్కువ కావడంతో సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు,తమిళం,బెంగాలీ సినిమాల్లో నటించింది.

తెలుగులో కథానిక, సూర్య వంటి సినిమాల్లో నైనీష హీరోయిన్ గా నటించింది. జెమినిలో భాగ్యరేఖ సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీమంతుడు, బంధం సీరియల్స్ లో నటిస్తోంది. ఈమె న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు. నటిగానే కాకుండా ఒక ప్రముఖ కంపెనీకి లీగల్ ఎడ్వైజర్ గా ఉన్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."