MoviesTollywood news in telugu

2021లో కన్నుమూసిన టాలీవుడ్ ప్రముఖులు ఎంత మంది…?

2021 died tollywood stars : తెలుగు చిత్రసీమలో నిర్మాతలుగా,దర్శకులుగా,హీరో,హీరోయిన్స్ గా, నటులుగా,సాంకేతిక నిపుణులుగా, రచయితలుగా,సింగర్స్ గా రాణిస్తూ తెలుగు కళామతల్లికి తమవంతు సేవ లో తరిస్తున్నవారు చాలామంది వున్నారు. అయితే 2021లో ఇప్పటివరకూ కొందరు సినీ ప్రముఖుల్ని కోల్పోయాం.

క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన వేదం మూవీలో నటించి సత్తా చాటిన 70ఏళ్ళ నాగయ్య జీవితం చివరి దశలో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఆతర్వాత నాగవల్లి,సీమటపాకాయి,నేనొక్కడినే,గమనం,అయ్యారే,గరుడ వేగ వంటి 30పైగా సినిమాల్లో నటించారు. మార్చి 27న కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 77ఏళ్ళు.

ఇక పొట్టి వీరయ్య. జన్మతః మరుగుజ్జుగా పుట్టిన వీరయ్య 1947లో జన్మించి, బ్లాక్ అండ్ వైట్ మూవీస్ నుంచి కలర్ సినిమాల వరకూ తనకు తగ్గ పాత్రల్లో నటిస్తూ వచ్చారు. సీనియర్ ఆర్టిస్టుగా రాణించిన ఈయనకు ఓ కూతురు ఉంది. అగ్గివీరుడు, తాతామనవడు,రాధమ్మ పెళ్లి, టార్జాన్ సుందరి,యుగంధర్ వంటి తెలుగు మూవీస్ తో పాటు ఇతర భాషల్లో సైతం కల్పి దాదాపు 500కి పైగా చిత్రాల్లో నటించారు. ఏప్రియల్ 25న మన్నుమూశారు.

యూట్యూబర్ గా,నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తుమ్మల నరసింహారెడ్డి (టీఎన్ ఆర్) ఇండస్ట్రీలో మంచి బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఎందరో నటీనటులను, ప్రముఖులను ఇంటర్యూ చేసారు. నేనే రాజు నేనే మంత్రి, సుబ్రహ్మణ్యపురం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి మూవీస్ లో నటించారు. మే 10న కన్నుమూసారు.

శివాజీ,ఒరే తమ్ముడు, జై శ్రీరామ్ వంటి మూవీస్ డైరెక్ట్ చేసిన సాయి బాలాజీ కూడా ఈ ఏడాది కన్నుమూశారు. తమిళ సినిమాలు చేసినా తెలుగులో కూడా డబ్బింగ్ అవ్వడంతో కమెడియన్ వివేక్ టాలీవుడ్ జనాలకు పరిచయం అయ్యాడు. శివాజీ, అపరిచితుడు వంటి హిట్ మూవీస్ లో నటించాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసిన వివేక్ ఏప్రియల్ 17న తనువు చాలించారు.

దాదాపు 1500సినిమాలకు ప్రమోటర్ గా మే 21న 57ఏళ్ల వయస్సులో మరణించారు. సేవలు అందించిన బిఎ రాజు నిర్మాతగా పలు సినిమాలు తీశారు. చిన్నారి పెళ్లికూతురు వంటి పలు సీరియల్స్ లో నటించిన 76ఏళ్ల సురేఖా సక్రి జులై 16న వృద్ధాప్యంతో కన్నుమూశారు. అలాగే జస్టిస్ చౌదరి, పెదరాయుడు వంటి సినిమాల్లో కంటతడి పెట్టించే పాత్రల్లో మెప్పించిన సీనియర్ నటి జయంతి కన్నడలో హీరోయిన్ గా చేసి, పలు అవార్డులు గెలుచుకుంది. తెలుగులో కృష్ణ, కృష్ణంరాజు తదితరులతో హీరోయిన్ గా చేసింది. జులై 26న 76ఏళ్ల వయస్సులో కన్నుమూశారు