MoviesTollywood news in telugu

స్టార్ హీరో కూతురుని గుర్తు పట్టారా…ఏమి చేస్తుందో తెలుసా?

Tollywood Hero Raghu Daughter :సినిమా రంగంలో వారసత్వానికి కొదవలేదు. అది బాలీవుడ్ అయినా,టాలీవుడ్ అయినా,కోలీవుడ్ అయినా ఏ భాషా రంగమైనా సరే వారసులు దుమ్మురేపుతున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి దాదాపు డజనుమంది ఇండస్ట్రీకి వచ్చి తమ సత్తా ఛాతుంటుంటే, వెంకటేష్, నాగార్జున ఫ్యామిలీ నుంచి కూడా వారసులు బాగానే వచ్చారు. బాలీవుడ్ లో కపూర్,బచ్చన్ తదితర ఫ్యామిలీల నుంచి వారసులు వచ్చారు. మిగిలిన హీరోల నుంచి కూడా వస్తున్నారు.

ఇక మలయాళ రంగంలో అయితే వర్మిన్ రెహ్మాన్ ఫ్యామిలీ ఏలేస్తోంది. మలయాళం రంగంలో దాదాపు 24విభాగాల్లో ఇతడి ఫామిలీ మెంబర్స్ ఉండడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహ్మాన్ కి అన్నయ్య వరుస అవుతాడు. ఎందుకంటే ఏ ఆర్ రెహ్మాన్, వర్మిన్ రెహ్మాన్ భార్యలిద్దరూ అక్కాచెల్లెళ్లు. దాంతో తోడల్లుళ్లు,అన్నదమ్ములు అవుతారు.

వర్మిన్ రెహ్మాన్ మలయాళంలో తన నటనతో అలరించి అక్కడ ఒక ఊపు ఊపాడు. అటునుంచి తమిళ రంగానికి వచ్చి అక్కడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో రఘు పేరుతొ ఎంట్రీ ఇచ్చి భారత్ బంద్, రాసలీల, సమరం, రేపటి రౌడీ, గోవిందుడు అందరి వాడేలే, లెజెండ్, జనతా గారేజ్ వంటి సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఇతడి కూతురు రషితా రెహ్మాన్ హీరోయిన్ గా రాణిస్తుంటే, ఇతర కుటుంబ సభ్యులు సపోర్టింగ్ ఆర్టిస్టులుగా, సాంకేతిక నిపుణులుగా సత్తా చాటుతున్నారు.