సాయికుమార్ తల్లి గురించి కొన్ని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
Sai Kumar Mother :డబ్బింగ్ ఆర్టిస్టుగా, క్యారెక్టర్ యాక్టర్ గా,హీరోగా,విలన్ గా ఇలా విభిన్న అంశాల్లో రాణిస్తున్న నటుడు సాయికుమార్ తన గొంతుని సుమన్, డాక్టర్ రాజశేఖర్ వంటి వాళ్లకు ఎరువిచ్చి వాళ్ళ సక్సెస్ కి దోహదపడ్డాడు. సాయికుమార్ తండ్రి పిజె శర్మ వాయిస్ కూడా కంచుకంఠం. అదే సాయికుమార్ కి వారసత్వంగా వచ్చింది. విజయనగరంలో రైల్వే స్టేషన్ లో పనిచేసే పిజె శర్మ నటన మీద మక్కువతో జెవి సోమయాజులు,జెవి రమణమూర్తి తదితరులతో నాటకాలు ఆడేవారు.
నాటకాలు వేస్తున్న సమయంలోనే సినిమాలలో కూడా చిన్న చిన్న వేషాలు వేసేవారు. 1959లో ఉద్యోగం వదిలేసి సినిమాల కోసం మద్రాసులో స్థిరపడ్డారు. ఇక సాయికుమార్ తల్లి ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. మైసూరు మహారాజుల దగ్గర ఆమె ముత్తాతలు పనిచేసేవారు. పోలో ఆడేవారు. ఒక నాటకంలో అనార్కలి వేషం వేసిన ఆమెను చూసి పిజె శర్మ మనసు పారేసు కోవడంతో అన్నీ వదిలేసి, శర్మ కోసం వచ్చేసారు. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు సాయికుమార్ తో సహా ఐదుగురు సంతానం.
నిజానికి సాయికుమార్ చిన్నప్పుడు కటిక పేదరికం చవిచూశారు. చాలీచాలని ఆదాయంతో పిజె శర్మ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పిల్లలకు స్కూల్ ఫీజులు కూడా కట్టలేని స్థితి. సాయికుమార్ బుక్స్ కొనే స్థోమత లేక, సీనియర్స్ దగ్గర అడిగి తీసుకుని చదువుకునేవారు. వాళ్ళ అమ్మ గోధుమ అన్నం బాక్స్ లో పెట్టి ఇచ్చేవారట. అన్నం బాగోలేదని సాయికుమార్ చెల్లెలు ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయట. మొత్తానికి తల్లి పెంపకంలో సాయికుమార్ తో సహా అందరూ మంచి స్థితికి చేరుకున్నారు. సాయికుమార్ కొడుకు ఆది హీరోగా చేస్తున్న సంగతి తెల్సిందే.