MoviesTollywood news in telugu

రాశీ ఖన్నా అభిమాన నటుడు ఎవరో తెలుసా?

Tollywood Heroine rashi khanna : తన అందచందాలతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన రాశీఖన్నా ఇప్పుడు వెబ్ సిరీస్ లో సైతం అడుగుపెడుతోంది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో కల్సి ఓ భారీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో విజయం అందుకున్న రాజ్ అండ్ షాహిద్ కపూర్ కొత్తగా భారీస్థాయిలో వెబ్ సిరీస్ ప్లాన్ చేసారు.

అయితే కోలీవుడ్ నటుడు, తెలుగులో ఉప్పెన లాంటి సినిమాల్లో విలన్ గా చేసిన విజయ్ సేతుపతి కూడా ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. మూడోసారి విజయ్ సేతుపతితో కల్సి నటిస్తున్నానని రాశీఖన్నా చెబుతూ అతడితో కల్సి తీయించుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. జై లవకుశ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ తో జతకట్టిన తరవాత మళ్ళీ టాలీవుడ్ లో నటించలేదు రాశీఖన్నా.

ఇక సెట్ లో తాను రాశీఖన్నాకు బాగా దగ్గరయ్యానని షాహిద్ కపూర్ చెప్పాడు. విజయ్ సేతుపతితో కల్సి నటించడం తనకు కూడా ఆనందంగా ఉందని షాహిద్ చెప్పుకొచ్చాడు. అయితే విజయ్ సేతుపతి తన అభిమాన నటుడని రాశీఖన్నా చెప్పడం విశేషం. ఇప్పటికే రెండు సినిమాల్లో సేతుపతితో కల్సి నటించిన తాను మూడోసారి కూడా నటించడం ఆనందంగా ఉందని చెప్పింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."