MoviesTollywood news in telugu

చెర్రీ సరసన నటించే కియారా రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్…?

Tollywood Heroine kiara advani :బాహుబలి తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి తెరెకెక్కిస్తున్న మూవీ ఆర్ ఆర్ ఆర్. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోపక్క శంకర్‌ డైరెక్షన్ లో పాన్‌ ఇండియా మూవీ లో రామ్ చరణ్ నటించబోతున్నాడు. ఈ చిత్రంలో కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సైతం ఓ కీలక పాత్రలో మెరవబోతున్నట్లు తెలుస్తోంది.

శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మించే ఈ మూవీలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. గతంలో వినయ విధేయ రామలో చెర్రీతో రొమాన్స్‌ చేసిన కియారా మరోసారి ఈ సినిమాతో జోడీ కడుతోంది.

కబీర్‌సింగ్‌ విజయంతో స్టార్‌ హీరోయిన్‌ గా పాపులారిటీ దక్కించుకున్న కియారా ఇప్పుడు భారీ రెమ్యునరేషన్‌ ఛార్జి చేస్తోందట. ఇది వరకు ఒక్కో సినిమాకు మూడున్నర నుంచి 4 కోట్ల వరకు అందుకునే కియారా ఇప్పుడు మరో కోటి రూపాయలు అదనంగా పెంచేసిందని టాక్‌. ముఖ్యంగా చెర్రీతో చేసే పాన్ ఇండియా మూవీలో నటించడానికి కియారా ఏకంగా 5కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్‌ చేసినట్లు ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."